రెండో రోజు ముగిసిన లోకేశ్ విచారణ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను సీఐడీ రెండో రోజు విచారించింది. బుధవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సీఐడీ అధికారులు లోకేశ్‌ను విచారించారు

రెండో రోజు ముగిసిన లోకేశ్ విచారణ

విధాత : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను సీఐడీ రెండో రోజు విచారించింది. బుధవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సీఐడీ అధికారులు లోకేశ్‌ను విచారించారు. రెండోరోజు విచారణపై లోకేశ్ మీడియాకు వివరిస్తూ రెండో రోజు 47ఫ్రశ్నలు అడిగారన్నారు. అవి కూడా నిన్న అడిగిన ప్రశ్నలనే అటు ఇటు తిప్పి అడిగారన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేవలం నాలుగైదు ప్రశ్నలు మాత్రమే వేశారన్నారు. రెండు రోజుల పాటు నా సమయం వృధా చేశారని, మళ్లీ నోటీస్‌లు ఏమైనా ఇస్తారా అని పశ్నించగా సమధానం చెప్పలేదన్నారు. నా తల్లి భువనేశ్వరి ఐటీ రిటర్న్ నా ముందు పెట్టి ప్రశ్నించగా, ఆమె ఐటీ రిటర్న్ మీ వద్ధకు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు జవాబు చెప్పలేదన్నారు. లింగమనేని అద్దె చెల్లింపులపైన ఐటీ రిటర్న్‌లో లేదని, క్విడ్ ప్రోకో ఉందా అని అగిడారని, ఐటీ రిటర్న్ ఆడిటర్‌ను అడుగాలని చెప్పానని, అద్దె చెల్లింపు క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని అడిగానన్నారు. నా మంత్రిత్వ శాఖకు సంబంధించిన పలు ప్రశ్నలు వేశారన్నారు. స్కిల్ కేసులో సంతకాలు పెట్టిన అధికారులను మాత్రం విచారించడం లేదని, సంబంధంలేని టీడీపీ చంద్రబాబును మాత్రం రిమాండ్ చేస్తారని నిలదీశారు. ఐఆర్‌ఆర్ పై సీఐడీ ఓ వీడియో చూపించారని, అందులో హెరిటేజ్ 9ఎకరాల భూములు కోల్పోతున్నట్లుగా ఉందన్నారు.