శ్రీకాళహస్తిలో నవరత్న నిలయం

విధాత‌ : శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి నవరత్నాల నిలయాన్ని నిర్మించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘జగనన్న నవరత్న’ పథకాలతో ప్రజల జీవనస్థాయి ప్రమాణాలు ఎలా పెరిగాయో స్ఫురించేలా తొమ్మిది పురుష హస్తాలు, నాలుగు మహిళ హస్తాలతో నవరత్న పథకాలను కళ్లకు కట్టినట్టు నిర్మించారు. నిలయం మధ్యలో పేదలకు కేటాయించిన జగనన్న పక్కాగృహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. నిలయం మధ్యలో జగన్‌ ఫొటో ఏర్పాటు చేసి నవరత్నాలతో ఆంధ్రప్రదేశ్‌ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే విధంగా చిత్రాలను […]

శ్రీకాళహస్తిలో నవరత్న నిలయం

విధాత‌ : శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి నవరత్నాల నిలయాన్ని నిర్మించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘జగనన్న నవరత్న’ పథకాలతో ప్రజల జీవనస్థాయి ప్రమాణాలు ఎలా పెరిగాయో స్ఫురించేలా తొమ్మిది పురుష హస్తాలు, నాలుగు మహిళ హస్తాలతో నవరత్న పథకాలను కళ్లకు కట్టినట్టు నిర్మించారు. నిలయం మధ్యలో పేదలకు కేటాయించిన జగనన్న పక్కాగృహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. నిలయం మధ్యలో జగన్‌ ఫొటో ఏర్పాటు చేసి నవరత్నాలతో ఆంధ్రప్రదేశ్‌ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే విధంగా చిత్రాలను రూపొందించారు.
అద్దాల గోపురంలో జగనన్న : నిలయంపైన ప్రత్యేకంగా అద్దాల గోపురం నిర్మించారు. మధ్యలో సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. రాగి ఆకుల్లో సీఎం జగన్‌ బొమ్మను చిత్రీకరించారు. అద్దాల గోపురంలోకి వెళ్లి ఎటు చూసినా సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటోలు కనిపిస్తాయి.
నిలయం నిర్మాణానికి ప్రత్యేక నిపుణులు : నవరత్నాల నిలయం కోసం ప్రత్యేకంగా నిపుణులను రప్పించారు. నిర్మాణానికి అవసరమైన సామగ్రిని కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి తెప్పించారు. నవరత్నాల నిలయం ప్రారంభం అనంతరం 2,500 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఒక్కో ఇంటి స్థలం విలువ రూ.14 లక్షలు ఉంటుందని అంచనా.