AP assembly elections | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌న్డీఏ కూటమి హవా.. 140కి పైగా స్థానాల్లో ఆధిక్యం
AP assembly elections | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి సత్తా చాటుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం దాదాపు ఖరారైనట్లేనని ఎర్లి ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను 140కి పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉన్నది. అందులో తెలుగుదేశం పార్టీ 120కి పైగా స్థానాల్లో, జనసేన పార్టీ 18 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
AP assembly elections : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి సత్తా చాటుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం దాదాపు ఖరారైనట్లేనని ఎర్లి ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను 140కి పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉన్నది. అందులో తెలుగుదేశం పార్టీ 120కి పైగా స్థానాల్లో, జనసేన పార్టీ 18 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
అధికార వైసీపీ ఘోరంగా చతికిలపడింది. ఆ పార్టీ కేవలం 20కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. అటు ఏపీ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ ఎన్డీఏ కూటమి హవానే కొనసాగుతున్నది. ఏపీలోని మొత్తం 25 లోకసభ స్థానాలకుగాను ఎన్డీఏ కూటమి 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. అందులో టీడీపీ 14 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో, జనసేన 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అధికార వైసీపీ కేవలం 5 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరుస్తున్నది.
ఏపీలో కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మొదట విడుదల కానున్నాయి. ఈ రెండు స్థానాల్లో 13 రౌండ్లలోనే ఫలితం తేలిపోతుంది. భీమిలి, పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు 26 రౌండ్లలో జరుగనుంది. ఏపీలోని లోకసభ నియోజకవర్గాల్లో రాజమహేంద్రవరం, నరసాపురం స్థానాల ఫలితాలు తొలుత వస్తాయి. ఈ స్థానాల్లో 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తవుతుంది. అయితే, అమలాపురం లోకసభ స్థానం ఫలితం అన్నింటికంటే ఆలస్యం అవుతుంది. ఇక్కడ అత్యధికంగా 27 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. ఇక్కడ కౌంటింగ్‌కు 9 నుంచి 10 గంటల సమయం పడుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram