Neerabh Kumar Prasad | ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

విధాత: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నీరభ్ కుమార్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఏపీలో పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేశారు. జవహర్ రెడ్డి ఇప్పటికే సెలవుపై వెళ్లారు. ఆయన ఈనెల పదవీ విరమణ చేయనున్నారు.