పాకిస్థాన్,చైనాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి: కిషన్ రెడ్డి
విధాత,తిరుపతి: దేశ సరిహద్దులో పాకిస్థాన్, చైనాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన తిరుపతిలోని అమరవీరుల సంస్మరణ స్థూపం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తోందన్నారు. పాక్ చర్యలను తిప్పికొడతామన్నారు. మోదీ హయాంలో దేశంలో ఎక్కడా అల్లర్లు, ఉగ్రవాదుల దుశ్చర్యలు జరుగలేదన్నారు. దేశ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారని, దేశం కోసం త్యాగం చేసిన వారిని ఎప్పటికీ గుర్తించుకోవాలన్నారు. దేశ రక్షణ కోసం […]
విధాత,తిరుపతి: దేశ సరిహద్దులో పాకిస్థాన్, చైనాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన తిరుపతిలోని అమరవీరుల సంస్మరణ స్థూపం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తోందన్నారు. పాక్ చర్యలను తిప్పికొడతామన్నారు. మోదీ హయాంలో దేశంలో ఎక్కడా అల్లర్లు, ఉగ్రవాదుల దుశ్చర్యలు జరుగలేదన్నారు.
దేశ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారని, దేశం కోసం త్యాగం చేసిన వారిని ఎప్పటికీ గుర్తించుకోవాలన్నారు. దేశ రక్షణ కోసం తిరుపతి లాంటి ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారన్నారు. సైనికుల కుటుంబాలకు అండగా ఉండాలని, వీరసతీమణుల ఆశీర్వాదం తీసుకోవాలని ప్రధానమంత్రి సూచించారని చెప్పారు. సైనికుల వల్లే దేశంలో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని, దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram