ఏపీలో రోడ్లపై రెడ్ బుక్ ఫ్లెక్సీలు.. లోకేశ్ ఫోటోలతో రెడ్ బుక్ సిద్ధం

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయానంతరం ఆ రాష్ట్రంలో రోడ్లపై రెడ్ బుక్ సిద్ధం ఫ్లెక్సీలు వెలియడం చర్చనీయాంశమైంది.

ఏపీలో రోడ్లపై రెడ్ బుక్ ఫ్లెక్సీలు.. లోకేశ్ ఫోటోలతో రెడ్ బుక్ సిద్ధం

విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయానంతరం ఆ రాష్ట్రంలో రోడ్లపై రెడ్ బుక్ సిద్ధం ఫ్లెక్సీలు వెలియడం చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి వైసీపీ ప్రభుత్వంపై రాజకీయ పోరాటంలో భాగంగా టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం యాత్రలో రెడ్ బుక్ ప్రస్తావనను తెచ్చారు. వైసీపీకి కొమ్ముకాస్తూ తమ పార్టీ శ్రేణులను వేధించినటువంటి, తనతో పాటు చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులను హెచ్చరిస్తూ రెడ్‌బుక్‌లో అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నామని, మేం అధికారంలోకి వచ్చాకా వారి సంగతి చూస్తామంటూ లోకేశ్ హెచ్చరించారు.

లోకేశ్ రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారంటూ ఏసీబీ,సీఐడీ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఆనాడు లోకేశ్ చెప్పిన రెడ్ బుక్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ రెడ్ బుక్ సిద్ధం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద అధికారులను గుబులు పుట్టించే విధంగా కనిపిస్తున్న రెడ్ బుక్ సిద్ధం ఫ్లెక్సీలను చూస్తున్న జనం ఈ పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు