Road accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
Road accident | ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైఎస్సార్ జిల్లా రామాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గువ్వల చెరువు ఘాట్‌లో సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చింతకొమ్మదిన్నె పరిధిలో కారు-కంటెయినర్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

Road accident : ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైఎస్సార్ జిల్లా రామాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గువ్వల చెరువు ఘాట్‌లో సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చింతకొమ్మదిన్నె పరిధిలో కారు-కంటెయినర్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురితోపాటు కంటైనర్ డ్రైవర్ కూడా మృతి చెందాడు. కారులో ఉన్న వారంతా బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.
మృతులు చక్రాయపేట మండలం కొన్నేపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు సందర్శించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఎస్పీ వెంట ఎస్బీ ఇన్‌స్పెక్టర్ యు వెంకటకుమార్, సీకె దిన్నె సీఐ శంకర్ నాయక్, రామాపురం సీఐ వెంకట కొండారెడ్డి ఉన్నారు.