రెండేళ్లలో రూ.2,350 కోట్లు ఆదా..మంత్రికి విద్యుత్‌ సంస్థల నివేదిక

విధాత,అమరావతి: విద్యుత్‌ సంస్థలు గత రెండేళ్లలో రూ.2,350 కోట్లు ఆదా చేశాయని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ తెలిపారు. దీనికోసం తీసుకున్న చర్యల నివేదికను మంత్రి శ్రీనివాసరెడ్డికి అందించినట్లు తెలిపారు. ‘కరోనా కారణంగా విద్యుత్‌ సంస్థలకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,300 కోట్ల నష్టాలు వచ్చాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు దొరికే విద్యుత్‌ కొనడంతో పాటు ఇతర చౌక పద్ధతులను అనుసరించాం. 2019-20లో 3,393 మిలియన్‌ యూనిట్లు(ఎంయూ) 2020-21లో 8,890 […]

రెండేళ్లలో రూ.2,350 కోట్లు ఆదా..మంత్రికి విద్యుత్‌ సంస్థల నివేదిక

విధాత,అమరావతి: విద్యుత్‌ సంస్థలు గత రెండేళ్లలో రూ.2,350 కోట్లు ఆదా చేశాయని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ తెలిపారు. దీనికోసం తీసుకున్న చర్యల నివేదికను మంత్రి శ్రీనివాసరెడ్డికి అందించినట్లు తెలిపారు. ‘కరోనా కారణంగా విద్యుత్‌ సంస్థలకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,300 కోట్ల నష్టాలు వచ్చాయి.

ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు దొరికే విద్యుత్‌ కొనడంతో పాటు ఇతర చౌక పద్ధతులను అనుసరించాం. 2019-20లో 3,393 మిలియన్‌ యూనిట్లు(ఎంయూ) 2020-21లో 8,890 ఎంయూల చౌక విద్యుత్‌ను కొనుగోలు చేశాం. సరఫరా ఛార్జీలు కలిపి యూనిట్‌ సగటున రూ.3.12కే వచ్చింది. యూనిట్‌కు సగటున రూ.4.55 వరకు కొనుగోలుకు అనుమతి ఉంది’ అని వివరించారు.
సరఫరా ఛార్జీల భారం తగ్గించుకున్నాం
‘విద్యుత్‌ సరఫరా కోసం కేంద్ర విద్యుత్‌ గ్రిడ్‌ను వినియోగించుకున్నందుకు మూడు నెలలకు ఒకసారి సెంట్రల్‌ ట్రాన్స్‌మిషన్‌ యుటిలిటీ(సీటీయూ), పాయింట్‌ ఆఫ్‌ కనెక్షన్‌(పీవోసీ) ఛార్జీల చెల్లింపు నిబంధనల్లో వచ్చిన మార్పులపై కేంద్రంతో చర్చించడం వల్ల డిస్కంలపై ఏటా రూ.350 కోట్ల భారం తగ్గింది. కేంద్ర థర్మల్‌ విద్యుత్‌ సంస్థల నుంచి అధిక ధరకు 625 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు చేసే ఒప్పందాలను రద్దు చేసుకోవటంతో డిస్కంలపై రూ.1,007 కోట్ల భారం తగ్గింది’ అని వెల్లడించారు.