వైసీపీ కవ్వింపులపై టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలి .. చంద్రబాబు పిలుపు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణులు చేస్తున్న కవ్వింపు చర్యల పట్ల టీడీపీ శ్రేణులు సహనం..సంయమనం పాటించాలని టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని టీడీపీ సహా కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు.

శాంతిభద్రతలు అదుపులో పెట్టండి
పార్టీ శ్రేణులకు..పోలీసులకుచంద్రబాబు పిలుపు
విధాత : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణులు చేస్తున్న కవ్వింపు చర్యల పట్ల టీడీపీ శ్రేణులు సహనం..సంయమనం పాటించాలని టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని టీడీపీ సహా కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు. శాంతిభద్రతలు అదుపులో ఉండేలా అటు పోలీస్ అధికారులు పక్కా చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటి వద్ధ టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. అధికారంలో ఉండగా తమపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, ఇప్పుడు అందుకు తమ నేతలకు క్షమాపణలు చెప్పాలంటూ వంశీ ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
వంశీ నివాసంపైకి రాళ్లు రువ్వగా, లోపల ఉన్న తల్లి కూతురుకు గాయలైనట్లుగా సమాచారం. ఈ సందర్భంగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను తరమికొట్టారు. మరోవైపు గుడివాడ తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిపై తెలుగు యువత శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. శుక్రవారం కొంత మంది యువకులు కొడాలి నాని ఇంటి వద్దకు వెళ్లి రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. ఇంటిలోకి వెళ్లేందుకు యత్నించిన యువకులను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఇచ్చిన మాటను నిలుపుకోవాలని డిమాండ్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు. కుప్పం నియోజకవర్గంలోనూ వైసీపీ కార్యకర్తలపై దాడులు సాగాయి. లక్ష్మిపురంలో వైసీపీ కార్యకర్త మహాలింగం ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అటు వైసీపీ తరుపున ప్రచారం చేసిన యాంకర్ శ్యామలకు పెద్ద ఎత్తున బెదిరింపులు ఎదురవ్వగా, ఆమె తన ప్రచారాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దంటూ సోషల్ మీడియాలో వేడుకున్నారు.