న్యూడ్ కాల్ కి టెంప్ట్ అయ్యాడు…

విధాత‌: సైబర్ నేరస్థులు రాను రాను మోసాల విషయంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఏమాత్రం అలసత్వం, ఏమరుపాటుగా ఉన్నా రూ.లక్షలు పోగొట్టుకోక తప్పడం లేదు. ఇలా ఎంతో మంది బాధితులు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థంకాక‌ చివరికి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవ‌లే జరిగిన ఓ ఘటనలో ఐటీ ఉద్యోగి ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ .29 లక్షలు పోగొట్టుకోవాల్సి వచ్చింది . వివ‌రాల్లోకి వెళితే..హైటెక్ సిటీలోని ప్రముఖ […]

  • Publish Date - December 3, 2021 / 04:05 AM IST

విధాత‌: సైబర్ నేరస్థులు రాను రాను మోసాల విషయంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఏమాత్రం అలసత్వం, ఏమరుపాటుగా ఉన్నా రూ.లక్షలు పోగొట్టుకోక తప్పడం లేదు. ఇలా ఎంతో మంది బాధితులు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థంకాక‌ చివరికి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

ఇటీవ‌లే జరిగిన ఓ ఘటనలో ఐటీ ఉద్యోగి ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ .29 లక్షలు పోగొట్టుకోవాల్సి వచ్చింది . వివ‌రాల్లోకి వెళితే..హైటెక్ సిటీలోని ప్రముఖ ఐటీ కంపెనీలోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ యువతి నగ్న వీడియో కాల్ కి టెంప్ట్ అవ్వడంతో ఏకంగా రూ .29 లక్షలు స‌మ‌ర్పించుకొవాల్సొచ్చింది . అసలేం జరిగిందంటే ..

ఫేస్ బుక్ లో అమ్మాయి ప్రొఫైల్ ఫొటో,పేరుతో అపరిచిత వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావ‌డంతో వెంటనే అతను యాక్సెప్ట్ చేసేశాడు . కాసేపటికి న్యూడ్ వీడియో కాల్ అంటూ మెసెంజర్లో మెసేజ్ పంపించింది .

దీంతో సరేనని ఎగిరి గంతేసిన ఇతను అందుకు రెడీ అయ్యాడు . కాల్ లిఫ్ట్ చేయగానే ఓ అమ్మాయి నగ్న వీడియో ప్లే అయింది.అయితే వాస్తవానికి అది లైవ్ వీడియో కాదు .. రికార్డెడ్ వీడియో . అటువైపు నుంచి ఆడ గొంతుతో ఈ టెకీని కూడా బట్టలు విప్పమని కోరింది.దీంతో ఇతను కూడా తన ఒంటిపై బట్టలు విప్పేశాడు.ఆ తర్వాత జరిగిన సన్నివేశం మొత్తాన్ని అటువైపు నుంచి సైబర్ నేరస్తులు వీడియో రికార్డు చేశారు.మొత్తానికి న్యూడ్ వీడియో కాల్ పూర్తయింది.

సీన్ క‌ట్ చేస్తే ఢిల్లీ ఏసీపీ పేరుతో కాల్ .. ఇకడ్నుంచి నేరస్థుల అసలు కథ మొదలైంది . వీడియో కాల్ పూర్తయ్యాక .. కాసేపటికి బాధితుడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది . ఢిల్లీ ఏసీపీని మాట్లాడుతున్నానని .. మీతో న్యూడ్ వీడియో కాల్ చేసిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని బెదిరించాడు.ఢిల్లీలో కేసు నమోదయిందని .. అరెస్ట్ చేస్తామని బెదిరించేసరికి .. ఇతను భయపడిపోయాడు. అమ్మాయి ఫోన్ లోని వీడియోలను సంబంధించిన రికార్డ్ అంతా రికవరీ చేశామని తెలిపారు. ఆ వీడియో ఇతనికే పంపడంతో నిజమేనని నమ్మేశాడు.

కేసుల్లాంటి తలనొప్పులు లేకుండా ఈజీగా బయటపడాలంటే కొంత డబ్బు పంపిచాలని కోరాడు. కొంత మంది అధికారులను మేనేజ్ చేయాల్సి ఉందని నమ్మబలికాడు. గత నెల 7 వ తేదీ నుంచి 20 రోజుల పాటూ విడతల వారీగా రూ .29 లక్షలు ఆన్లైన్లో సమర్పించుకున్నాడు. అయినా వదిలిపెట్టకుండా పదే పదే బెదిరిస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో గురువారం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు . దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదంతా రాజస్తాన్ చెందిన సైబర్ ముఠా పనేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు .

అయితే, ఇలాంటి ఘటనలపై సైబరాబాద్ పోలీసులు స్పందించారు . ఇప్పటివరకు నగ్న వీడియో కాల్స్ ఘటనలపై 6 , 7 కేసులు నమోదయ్యాయని .. ఈ తరహా మోసాలను సెక్టార్షన్ అని పిలుస్తారని తెలిపారు. ఈ తరహా బాధితులు చాలా మందే ఉంటారు కానీ , చెప్పుకోవటానికి సిగ్గుపడి ముందుకు రావటం లేదని వెల్లడించారు. పోలీసులు ఏమంటారోనని భయపడుతుంటారని .. సైబర్ నేరస్తులకు ఇదే ఆయుధంగా మారుతోందని వెల్లడించారు .

Latest News