police websites hacked| పోలీసులకు మరో సవాల్..కమిషనరేట్ల వైబ్ సైట్ల హ్యాకింగ్!
సైబర్ క్రైమ్ నేరస్తులు ఈ దఫా ఏకంగా హైదరాబాద్ పోలీస్ శాఖను లక్ష్యంగా చేసుకుని తమ పనితనం చూపించడం కలకలం రేపింది. హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్, తెలంగాణ సీఎంవో మీడియా వాట్సాప్ గ్రూప్ హ్యాకింగ్ తర్వాతా..తాజాగా పోలీస్ వెబ్‌సైట్‌లను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్లను సైబర్ కేటుగాళ్లు హ్యాకింగ్ చేసి పోలీసులకు సవాల్ విసిరారు.
విధాత, హైదరాబాద్ : సైబర్ క్రైమ్ నేరస్తులు ఈ దఫా ఏకంగా హైదరాబాద్ పోలీస్ శాఖను లక్ష్యంగా చేసుకుని తమ పనితనం చూపించడం కలకలం రేపింది. హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్, తెలంగాణ సీఎంవో మీడియా వాట్సాప్ గ్రూప్ హ్యాకింగ్ తర్వాతా..తాజాగా పోలీస్ వెబ్‌సైట్‌ల(Hyderabad police websites hacked)ను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. సైబరాబాద్(Cyberabad), రాచకొండ(Rachakonda) పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్ల(commissionerates hacked)ను సైబర్ కేటుగాళ్లు హ్యాకింగ్ చేసి పోలీసులకు సవాల్ విసిరారు. హ్యాకింగ్ దెబ్బకు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసు వెబ్‌సైట్లు 10 రోజులుగా పనిచేయడం లేదు. వీటిలోకి మాల్‌వేర్(malware redirec) చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెబ్‌సైట్‌ను క్లిక్ చేస్తే గేమింగ్ అప్లికేషన్‌కు, బెట్టింగ్ యాప్ లకు రీడైరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు. దీంతో సర్వర్లను డౌన్ చేసి వాటిని నిర్వహిస్తున్న ఎన్‌ఐసీ(NIC)కి సమాచారం అందించారు.
వెబ్‌సైట్ల పునరుద్ధరణకు ఎన్‌ఐసీ పర్యవేక్షణలో ప్రతినిధులు పనిచేస్తున్నారు. వైబ్ సైట్ల హ్యాకింగ్ సమస్యలను పరిష్కరించేందుకు రెండు కమిషనరేట్లలోని ఐటీ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వాటి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తున్నారు. మళ్లీ హ్యాకింగ్ కాకుండా అధునాతన ఫైర్‌వాల్స్‌ను వినియోగించేందుకుఐటీ బృందం కసరత్తు చేస్తుంది. హ్యాకింగ్ ముఠాలపై దృష్టి పెట్టిన ఎన్ ఐసీ బృందం..సైబర్ క్రైమ్ పోలీసులతో సమన్వయం చేస్తూ హ్యాకింగ్ సమస్యలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram