Telangana Thalli | ఇటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..అటు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
ఏపీ, తెలంగాణలో ఒకే రోజు సోమవారం రెండు కీలక విగ్రహాల ఆవిష్కరణ ఘట్టాలు జరుగడం ఆసక్తికరం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవానికి ముందు అసెంబ్లీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. అటు ఏపీ రాజధాని అమరావతిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి సందర్బంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
విధాత : ఏపీ, తెలంగాణలో ఒకే రోజు సోమవారం రెండు కీలక విగ్రహాల ఆవిష్కరణ ఘట్టాలు జరుగడం ఆసక్తికరం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవానికి ముందు అసెంబ్లీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ విగ్రహం పక్కన పునరుద్ధరించిన మండలి భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
అటు ఏపీ రాజధాని అమరావతిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి సందర్బంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం చేశారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఇక్కడే 6.8 ఎకరాల విస్తీర్ణంలో స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ. 150 కోట్ల కేటాయించడం విశేషం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Faria Abdullah | సమ్మర్ హీట్ పెంచేసిన ఫరియా.. చిట్టిలో బోల్డ్ యాంగిల్.. అందాల అరాచకం
Air India | ఎయిరిండియా ఉద్యోగుల కక్కుర్తి.. ఫ్రీ టికెట్లను అధిక ధరలకు అమ్ముకున్న 4 వేల మంది!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram