శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. మున్ననూరు నుంచి శ్రీశైలం, హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనదారులకు నల్లమల అడవిలో ఘాట్ రోడ్డు దాటుతూ పెద్దపులి కనిపించింది.

పెద్దపులి సమీపంలోకి రావడంతో ప్రయాణికులు,పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో పులి దృశ్యాలను చిత్రీకరించి సంబరపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. శ్రీశైలం వెళ్లే భక్తులు, వాహనదారులు రాత్రి సమయాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నల్లమల అడవులలో పెద్దపులులు, చిరుతల జనాభా గణనీయంగా పెరిగిపోవడంతో తరుచూ పెద్దపులులు శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్డులు, అడవి దారులలో కనిపిస్తుండటం కొనసాగుతుంది.

Latest News