మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫైళ్ల పరిష్కారంలో జాప్యంపై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసులోని టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటంతో అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా జూపల్లి కృష్ణారావు స్వయంగా నీళ్లు పోసి వాటిని శుభ్రం చేశారు. తన చర్యలతో మంత్రి జూపల్లి అధికారులకు పరిశుభ్రత పాఠం చెప్పారు.
ఈ సందర్బంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రెవెన్యూ వినతులపై కార్యాలయంలో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. మండల రెవెన్యూ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తున్న అన్ని ఫైళ్లలోనూ జాప్యం చేస్తుండడంపై కొల్లాపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి బన్సిలాల్ పై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని అర్జీలను మంత్రి జూపల్లి పరిశీలించారు.
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెళ్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి, అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
అధికారులు, సిబ్బందిపై జూపల్లి ఆగ్రహం pic.twitter.com/a36AKXyXU4
— Telugu Scribe (@TeluguScribe) August 21, 2026