టమోటా తోటలో పనికి నెలకు రూ.12వేలు..వైరల్ జాబ్ ఆఫర్

టామోటా తోటలలో పనిచేస్తే నెలకు రూ. 12వేలు ఇస్తామని..వేతనంతో పాటు టీ, స్నాక్స్, కూల్ డ్రింక్స్ వంటి ఇతర ఆఫర్లు కూడా ఇస్తామంటూ ఓ మహిళా రైతు జాబ్ ఆఫర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏపీలోని మధనపల్లికి చెందిన మహిళ రైతు ఈ వీడియోను షేర్ చేశారు.

అమరావతి : టామోటా తోటలలో పనిచేస్తే నెలకు రూ. 12వేలు ఇస్తామని..వేతనంతో పాటు టీ, స్నాక్స్, కూల్ డ్రింక్స్ వంటి ఇతర ఆఫర్లు కూడా ఇస్తామంటూ ఓ మహిళా రైతు జాబ్ ఆఫర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏపీలోని మధనపల్లికి చెందిన మహిళ రైతు ఈ వీడియోను షేర్ చేశారు. టమాటో తోటలో పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి వీడియో ద్వారా దరఖాస్తులు కోరారు. ఈ పనికి నెలకు 12,000 రూపాయల శాలరీ ఇస్తామని..ఇలాంటి జాబ్ అవకాశం మళ్లీ రాదని, వేతనం ఒకటే కాకుండా పై ఆదాయం కూడా ఉంటుందని ఆ రైతు ఆఫర్ ఇవ్వడం గమనార్హం.

పని వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటాయని, ఉద్యోగులకు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే వేడి వేడి టీ ఇస్తారని, మధ్యాహ్నం 12 గంటలకు చల్లని కూల్ డ్రింక్ ఉచితంగా ఇస్తామని ఆఫర్ చేశారు. టమాటో మొక్కలు నాటడం, పురి కట్టడం, కాయలు కోయడంపై మొదట నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని ఆ రైతు వెల్లడించారు. శిక్షణ లేకపోతే చెట్ల కొమ్మలు విరగ్గొడతారని, పచ్చికాయలు కోసేస్తారని, అందుకే ట్రైనింగ్ ఇస్తామని పేర్కొంది.

జీతంతో పాటు తోటలోని కూరగాయలు, మామిడికాయలు, ఆకుకూరలను ఉచితంగా ఇస్తాం అని, వచ్చే ఆదివారం చికెన్, పూరి, రాగి సంగటితో తమ బావమ్మ గ్రాండ్ డిన్నర్ ఇస్తోందని తెలిపింది. ఫాలోవర్స్ అందరూ రావచ్చని ఆహ్వానం పలికింది. ఇలాంటి అద్భుతమైన ఉద్యోగ అవకాశం మళ్లీ రాదు అని, వెంటనే లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ చేయండి అంటూ మహిళా రైతు చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

Latest News