మహిళకు అధికారం లేదు అనే వాదన ఈ కాలంలో చెల్లదు
విధాత:మీడియాతో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక మాన్సాస్ ట్రస్టుకు తొలి మహిళా ఛైర్ పర్సన్ గా సంచయిత వ్యవహారించారు.ఆమెను దించడానికి దుష్ట ప్రయత్నం జరిగింది.. ఒక మహిళ ఛైర్మన్ పదవి నుంచి దిగిపోతే సంబరాలు చేసుకున్నారు. మహిళకు అధికారం లేదు అనే వాదన ఈ కాలంలో చెల్లదు రక్షణ రంగంలో మహిళలకు ప్రవేశం లేదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది, అక్షింతలు వేసింది.రక్షణ రంగంలో కూడా మహిళలను కోటా ప్రకారం […]

విధాత:మీడియాతో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక మాన్సాస్ ట్రస్టుకు తొలి మహిళా ఛైర్ పర్సన్ గా సంచయిత వ్యవహారించారు.ఆమెను దించడానికి దుష్ట ప్రయత్నం జరిగింది.. ఒక మహిళ ఛైర్మన్ పదవి నుంచి దిగిపోతే సంబరాలు చేసుకున్నారు.
మహిళకు అధికారం లేదు అనే వాదన ఈ కాలంలో చెల్లదు రక్షణ రంగంలో మహిళలకు ప్రవేశం లేదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది, అక్షింతలు వేసింది.రక్షణ రంగంలో కూడా మహిళలను కోటా ప్రకారం తీసుకోవాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది లింగ వివక్షత ఎక్కడ చూపినా నేరం అవుతుందని భారత రాజ్యాంగంలోనే ఉంది.మహిళలకు అధికారం లేదని చెప్పే ఏ వాదన చెల్లదు,రాజరికం ముసుగులో మాన్సాస్ ట్రస్టులో మహిళల హక్కులపై దాడి జరిగింది. మహిళలకు కొన్ని ప్రదేశాల్లో ప్రవేశం లేదు, మహిళలకు కొన్ని ఛైర్స్ లో కూర్చొనే అర్హత లేదని చెప్తున్నామంటే.. కాలాన్ని మనం వెనక్కి తీసుకెళ్తున్నామా?.. సతీసహగమన కాలానికి, బ్రిటీష్ కాలానికి తీసుకెళ్తున్నట్లుంది..
జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకు స్వర్ణయుగం మొదలైంది.ప్రతి పథకంలో, పదవుల్లోనూ మహిళకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారు,ఇటువంటి పరిస్థితుల్లో మాన్సాస్ ట్రస్టులో మహిళకు అర్హత లేదని, టీడీపీ దానిని భుజాన వేసుకుని మాట్లాడడం అంటే మహిళల పట్ల వారికున్న గౌరవం ఇదేనా? ఏం సంకేతం ఇస్తున్నారు?.మహిళలు అన్న కారణంతో వారికి దక్కాల్సిన హక్కులను హరించవచ్చా? మా చట్టం ఒప్పుకోదు, మహిళలకు హక్కు లేదు.. అనే వాదన ఎక్కడైనా చెల్లుబాటు అవుతుందా?
మహిళ కాబట్టి పదవికి అనుర్హురాలు అనే లింగవివక్ష తో కూడిన వాదన చెల్లుతుందా?
మహిళ అనర్హురాలు అని ఒక రాజు శిలాశాసనం చేశాడంటే అది చెల్లుబాటు అవుతుందా?
సతీసహగమనం లాగే ఇది కూడా ఒక దురాచారమే
మహిళలను మళ్లీ వెనుక్కి తీసుకెళ్లే ప్రయత్నమే ఇది
మహిళలను మళ్లీ ఇంట్లో నుంచి బయటకు రాకుండా, భర్తతో పాటే చితిలో కాలిపోవాలనే పురాతన కాలంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? అని అన్నారు.