YS Sharmila | జగన్ వ్యాఖ్యలపై కంటతడి పెట్టిన షర్మిల
రాజకీయ కాంక్షతోనే తాను కడపలో పోటీ చేస్తున్నాని ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్ధి షర్మిల కంటతడి పెట్టుకున్నారు.
ఆరోపణలపై ప్రమాణానికి సిద్ధమా అన్ని సవాల్
విధాత: రాజకీయ కాంక్షతోనే తాను కడపలో పోటీ చేస్తున్నాని ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్ధి షర్మిల కంటతడి పెట్టుకున్నారు. కడపలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను అడిగే ప్రశ్నలకు జగన్ సూటిగా సమాధానం చెప్పాలన్నారు. ‘రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని జగన్ అంటున్నారని, నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా? జైల్లో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమన్నది ఆయన కాదా? నా భర్త, పిల్లల్ని వదిలేసి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, మీ భవిష్యత్ కోసం కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదన్నారు.
రాజకీయ కాంక్ష ఉంటే అప్పుడే పార్టీని హైజాక్ చేసేదాన్ని కాదా? మా కోసం అధికారం ఉపయోగించాలని నెపోటిజంకు ఒత్తిడి చేశారంటూ చెప్పిన మీరు మీ నుంచి పైసా సాయం కోరినట్టయినా నిరూపించగలరా? అని నిలదీశారు. మీరు వైఎస్సార్ కొడుకు అని ఎందుకు మర్చిపోతున్నారని, ప్రపంచంలో రాజకీయ విబేదాలు ఉన్నవాళ్లు చాలా మంది ఒకే కుటుంబంలో ఉన్నారన్నారు. వేర్వేరు పార్టీలో ఉండి ఒకే కుటుంబంలో కొనసాగుతున్నవారు చాలా మంది ఉన్నారన్నారు. నాకు రాజకీయ కాంక్ష లేదని ప్రమాణం చేసి చెప్పగలననని, నేను పదవి అడిగాననని మీరు అదే బైబిల్‌పైన ప్రమాణం చేసి చెప్పగలరా? అని ప్రశ్నించారు. నాకు రాజకీయ కాంక్ష ఉందనిగాని, డబ్బు కాంక్ష ఉందని మీరు చేసిన వ్యాఖ్యలు విచారకరమన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram