Viveka Murder Case | వివేకా హత్య కేసు విచారణ ఈ నెల 19కి వాయిదా
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. సీబీఐ దర్యాప్తు పూర్తయిందని నివేదించగా, సునీత తరఫు నుంచి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరారు.
Viveka Murder Case | న్యూఢిల్లీ : మాజీ ఎంపీ వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు విచారణలో భాగంగా వివేకా హత్యకేసులో దర్యాప్తు ముగిసిందని సీబీఐ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ కేసులో ఇంకా విచారించాల్సిందేమీ లేదని..కోర్టు దర్యాప్తుపై ఏమైనా ఆదేశాలిస్తే వాటిని అమలు చేస్తామని సీబీఐ పేర్కొంది. జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలో వివేకా హత్య కేసు విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతుంది.
హత్యకేసు సాక్షులను బెదిరిస్తున్న ప్రధాన నిందితుడు, స్థానిక ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా ఇప్పటికే సుప్రీంకోర్టును కోరారు. తదుపరి విచారణ సందర్భంగా ఈ విషయమై కీలక ఆదేశాలు వెలువడే అవకాశముంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram