YSRCP | నేటి నుంచి 40 రోజుల పాటు వైసీపీ ప్రజా ఉద్యమం

17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేటి నుంచి నవంబర్ 22 వరకు 40 రోజుల పాటు 'రచ్చబండ' పేరుతో వైసీపీ ప్రజా ఉద్యమం ప్రారంభించింది. కోటి సంతకాల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది.

YSRCP | నేటి నుంచి 40 రోజుల పాటు వైసీపీ ప్రజా ఉద్యమం

విధాత : ఏపీలో వైసీపీ హయాంలో ప్రారంభించిన 17మెడికల్ కాలేజీల పరిరక్షణకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ ఆదేశాలతో ఆ పార్టీ శుక్రవారం నుంచి నవంబర్ 22 వరకు 40రోజుల పాటు రచ్చబండ కార్యక్రమం పేరుతో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఉద్యమంలో భాగంగా 40రోజుల పాటు రచ్చబండ పేరుతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో కోటి సంతకాల సేకరణ నిర్వహిస్తారు. ఈ నెల 28న నియోజకవర్గాల్లో వైసీపీ ర్యాలీలు నిర్వహించనుంది. నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టి..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించాలని నిర్ణయించింది. నవంబర్ 24న కోటి సంతకాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. సేకరించిన కోటి సంతకాలను రాష్ట్ర గవర్నర్ కి వైసీపీ నేతలు అందిస్తారు.

ఏపీ సీఎం చంద్రబాబు వైసీసీ హయాంలో ప్రారంభించిన 17మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించారని..అదే జరిగితే పేదలకు ఖరీదైన వైద్యం అందబోదని..అలాగే మెడికల్ విద్యార్థులు ఆ మేరకు సీట్లు నష్టపోతారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. 5వేల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీలు నడుస్తాయని..అలా చేయకుండా ప్రైవేట్ పరం చేయడం సరికాదంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టింది.