Beauty tips | మీ నోటిలో పళ్లు మిలమిలా మెరవాలా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!

Beauty tips : తెల్లని పలువరుస మనల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. పళ్లు తెల్లగా ఉంటే మనం నవ్వినా, మాట్లాడిన ఎదుటి వారికి అందంగా కనిపిస్తాం. కానీ కొందరిలో పళ్లు పచ్చగా ఉంటాయి. పళ్లపై చారలు ఏర్పడుతాయి. ఇలాంటి వాళ్లు తమ పళ్లు తెల్లగా లేవని బాధ పడుతుంటారు. నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడటానికి, నవ్వడానికి సంకోచిస్తుంటారు.

  • Publish Date - May 18, 2024 / 12:03 PM IST

Beauty tips : తెల్లని పలువరుస మనల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. పళ్లు తెల్లగా ఉంటే మనం నవ్వినా, మాట్లాడిన ఎదుటి వారికి అందంగా కనిపిస్తాం. కానీ కొందరిలో పళ్లు పచ్చగా ఉంటాయి. పళ్లపై చారలు ఏర్పడుతాయి. ఇలాంటి వాళ్లు తమ పళ్లు తెల్లగా లేవని బాధ పడుతుంటారు. నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడటానికి, నవ్వడానికి సంకోచిస్తుంటారు. ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. అలాంటి వాళ్లు ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే పళ్లు తెల్లగా మారడానికి పనికొచ్చే కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

చిట్కాలు..

  • టూత్‌ పేస్టులో (Tooth paste) ఉండే ఉప్పు తేలికపాటి క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒక రాపిడి ఏజెంట్‌గా పని చేస్తుంది. అందుకే దంతాలపై ఉన్న మరకలను తొలగించి తెల్లగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి పళ్లు తెల్లగా లేని వాళ్లు ఉప్పుతో రోజూ ఒకటి రెండు నిమిషాలు దంతాలను సున్నితంగా రుద్దుకోవాలి. గట్టిగా రుద్దితే పళ్లపై ఉన్న ఎనామిల్‌ అరిగిపోయే ప్రమాదం ఉంది.
  • అదేవిధంగా తెల్లటి దంతాల కోసం కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఒక స్పూన్ నూనెను నోట్లో వేసుకుని పుక్కిలి పట్టాలి. కాసేపటి తర్వాత నూనెను ఉంచేసి దంతాలను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దాంతో పళ్లపై ఉన్న బ్యాక్టీరియా తగ్గుతుంది. కావిటీస్ వల్ల వచ్చే దంతక్షయ సమస్య పరిష్కారం అవుతుంది. కొబ్బరి నూనెలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు దంతక్షయాన్ని తగ్గిస్తాయి.
  • యాపిల్ సైడర్ వెనిగర్ కూడా దంతాలను తెల్లగా మార్చడానికి తోడ్పడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి పుక్కిలి పట్టాలి. దాంతో దంతాలపై ఉన్న మరకలు తగ్గిపోతాయి. అయితే వెనిగర్‌కు ఆమ్ల స్వభావం అధికం, నేరుగా వాడితే దంతాలపై ఎనామిల్‌ క్షీణిస్తుంది. కాబట్టి దాన్ని నీటిలో కలిపి వాడాలి. ఈ మిశ్రమాన్ని రోజూ మౌత్‌ వాష్‌లా వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • బేకింగ్ సోడాను పేస్టుగా చేసి వాడితే కూడా పళ్లు తెల్లగా మెరుస్తాయి. బేకింగ్‌ సోడా పేస్టుతో దంతాలను రోజూ సున్నితంగా 1 నుంచి 2 నిమిషాలపాటు శుభ్రం చేసుకోవాలి. ఇది పళ్ల మీద మరకలను తొలగిస్తుంది. దీనిలోని ఆల్కలీన్ స్వభావం నోటిలోని PH స్థాయిలను సమతుల్యం చేయడంలో తోడ్పడుతుంది. నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను కూడా తగ్గిస్తుంది.

Latest News