Numerology | ఈ మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారట..!
Numerology | న్యూమరాలజీ( Numerology ) ప్రకారం.. కొన్ని తేదీల్లో జన్మించిన అమ్మాయిలకు( Girls ) డబ్బు పిచ్చి అధికంగా ఉంటుందట. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారట. అంతేకాదు కాబోయే భర్త( Husband ) విషయంలో కూడా అంచనాలు ఎక్కువే ఉంటాయట. అయితే ఈ మూడు తేదీల్లో జన్మించిన అమ్మాయిలు మాత్రం నిత్యం లగ్జరీ లైఫ్( Luxury Life )ను కోరుకుంటారని పండితులు చెబుతున్నారు. మరి ఆ మూడు తేదీలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
Numerology | జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనప్పుడు.. తమకు ఏదో కీడు కలుగుతుందని భావించి జ్యోతిష్య పండితులను లేదా న్యూమరాలజీ ఎక్స్‌పర్ట్స్( Numerology Experts )ను ఆశ్రయిస్తుంటారు. ఇక వారు బాధితుల పుట్టిన తేదీ ప్రకారం.. అంకెలతో అంచనాలు వేసి.. ఏం చేయాలో, ఏం చేయకూడదో చెబుతుంటారు. భవిష్యత్ ఎలా ఉంటుందో కూడా నిర్ణయిస్తారు. అయితే 2, 11, 20 తేదీల్లో జన్మించిన స్త్రీలు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని( Luxury Life ) కోరుకుంటారని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. అనుకున్నది కచ్చితంగా సాధిస్తారు. అలాగే వీళ్లు ఎమోషనల్ పర్సన్స్‌గా ఉంటారని పేర్కొంటున్నారు.
భర్తలు అదృష్టవంతులట..!
2, 11, 20 తేదీల్లో జన్మించిన అమ్మాయిలను పెళ్లి చేసుకునే వారికి అదృష్టం కలిసి వస్తుందట. జీవితాంతం భర్తతో నిజాయితీగా ఉంటారట. అంతేకాకుండా మంచి భార్యలుగా, కోడళ్లుగా ప్రశంసించబడుతారట.
కుటుంబం పురోభివృద్ధి..!
2, 11, 20 తేదీల్లో పుట్టిన అమ్మాయిల కుటుంబంలో కచ్చితంగా పురోభివృద్ధి ఉంటుందట. కోడలిగా ఏ ఇంట్లో అయితే అడుగు పెడుతారో ఆ ఇంట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. ఇతరులకు సహాయం చేసే గుణం అధికంగా ఉంటుందట.
అందం, ఆకర్షణీయం వీరి సొంతం..!
2, 11, 20 తేదీల్లో తేదీల్లో జన్మించిన అమ్మాయిలు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండటమే కాదు.. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా, విలాసంగా ఉండేందుకు ఇష్ట పడుతూ ఉంటారు. వీరి ఎలాంటి కష్టాలు వచ్చిన సులభంగా ఎదుర్కొంటారని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram