Numerology | ఈ 3 తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు అందం, ఆకర్షణ సొంతం..!
Numerology | అమ్మాయిలు( Girls ) ఎల్లప్పుడూ అందం( Beauty )గా ఉండాలని కోరుకుంటారు. అందుకు ఆకర్షణీయం( Attraction )గా కూడా అలంకరించుకుంటారు. అయితే ఈ మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు పుట్టుకతోనే అందం, ఆకర్షణ వారి సొంతమట.

Numerology | ఇటీవలి కాలంలో చాలా మంది న్యూమరాలజీ( Numerology )ని నమ్ముతున్నారు. న్యూమరాలజీ ప్రకారం.. తమ పేర్లలోని అక్షరాలను కూడా మార్చుకుంటారు. ఇక తమ రాశికి అనుగుణంగా రంగు రాళ్లను ధరించడం.. ఇతర పరిహారాలు చెల్లించడం వంటివి చూస్తుంటాం. అయితే ఇదే న్యూమరాలజీ ప్రకారం.. ఈ మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయిలు( Girls ).. ధనవంతులుగా వర్ధిల్లుతారట. అంతేకాదు.. ఒక భార్య( Wife )గా, ఒక కోడలి( Daughter in Law )గా గొప్ప పేరు తెచ్చుకుంటారట. అంతేకాదు ఈ మూడు తేదీల్లో జన్మించిన మగువలకు అందం( Beauty ), ఆకర్షణ( Attraction ) కూడా వారి సొంతమట. మరి ఆ మూడు తేదీల్లో ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
అమ్మాయిలకు కలిసొచ్చే మూడు తేదీలు ఇవే..
- న్యూమరాలజీ ప్రకారం.. 2, 11, 20 తేదీల్లో జన్మించిన అమ్మాయిల్లో చాలా మంది విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారని పండితులు చెబుతున్నారు. అంతేకాదు అనుకున్నది కూడా కచ్చితంగా సాధించి తీరుతారట. నమ్మిన వారికి నమ్మకంగా ఉంటూ ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటారని పండితులు చెబుతున్నారు.
- ఈ మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. అత్తగారింట్లో మంచి భార్యలుగా కూడా పేరు తెచ్చుకుంటారట. వీరి భర్తలు కూడా అదృష్టవంతులట. భర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. వారి యోగక్షేమాల కోసం నిత్యం ఆరాటపడుతారని పండితులు చెబుతున్నారు.
- ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు అమ్మాయిలు ఏ ఇంటికి కోడలిగా వెళ్లినా ఆ కుటుంబానికి పురోభివృద్ధి లభిస్తుంది. ఆడపడుచులతో కలిసి మెలిసి ఉంటారట. ధనవంతులుగా ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసేందుకు ఎప్పుడు కూడా ముందడుగు వేస్తారని పండితులు చెబుతున్నారు.
- 2, 11, 20 తేదీల్లో తేదీల్లో జన్మించిన అమ్మాయిలు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండటమే కాదు.. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా, విలాసంగా ఉండేందుకు ఇష్ట పడుతూ ఉంటారు. వీరి ఎలాంటి కష్టాలు వచ్చిన సులభంగా ఎదుర్కొంటారని పండితులు పేర్కొంటున్నారు.