Black Neck | మెడ భాగం నల్లగా మారి ఇబ్బంది పెడుతోందా..? అయితే ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి
మెడ నలుపుతో బాధపడుతున్నారా? నిమ్మ, పెరుగు, తేనె వంటి ఇంటి చిట్కాలతో బ్లాక్ నెక్ సమస్యకు సులభ పరిష్కారం తెలుసుకోండి.
Black Neck | పొల్యూషన్, వాతావరణ మార్పులు, వ్యక్తిగత శుభ్రత.. వంటివి అందానికి అడ్డంకులుగా మారుతున్నాయి. మన చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తున్నాయి. కొందరికి ముఖం తెల్లగా ఉన్నా మెడ భాగం మాత్రం నల్లగా (Black Neck) మారి ఇబ్బంది పెడుతుంటుంది. దాన్ని కవర్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మెడ కవర్ చేసేందుకు కాలర్ నెక్స్ వేసుకోవడం, లేదా జుట్టుని వదులుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే, ఇకపై అలా చేసే అవసరం లేదు. ఎందుకంటే..? ఈ సమస్యకి చెక్ పెట్టేందుకు కొన్ని ఇంటి చిట్కాలు (Home Remedies) హెల్ప్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కొద్దిగా పెరుగులో నిమ్మరసం వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని మెడ భాగంలో అప్లై చేసి.. 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. పెరుగు మాయిశ్చరైజర్‌లా పనిచేయడంతో పాటు చర్మంపై పేరుకున్న మురికిని తొలగిస్తుంది.
పసుపు, పాలు కలిసి.. ఆ మిశ్రమాన్ని మెడకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మరసం, రోజ్‌వాటర్‌లను సమపాళ్లలో కలిపి రోజూ రాత్రి నిద్రపోయే ముందు మెడకు రాసుకోవాలి. ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే మెడపై ఏర్పడిన నలుపు క్రమంగా తగ్గిపోతుందట.
బొప్పాయని పేస్టులా చేసి.. అందులో రోజ్ వాటర్, కొద్దిగా పెరుగు కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దాన్ని మెడ భాగంలో ప్యాక్‌లా అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెడ భాగం మెరుస్తుంది.
బంగాళాదుంపని పొట్టు తీసి మెత్తగా మిక్సీ పట్టాలి. అందులోంచి రసాన్ని తీసి మెడచుట్టూ అప్లై చేయాలి. ఆరిన తర్వాత నీటితో క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
కొద్దిగా తేనె, కొంచెం నిమ్మరసం బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని నల్లగా ఉన్న చోట రాసి కాసేపటికి క్లీన్ చేసుకుంటే చర్మం నిగారిస్తుంది. దీని వల్ల మెడ నలుపు తగ్గడమే కాదు. తేమ పెరిగి చక్కగా నిగనిగలాడుతుంది.
కాటన్‌తో నిమ్మరసాన్ని మెడ భాగంలో అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే.. చర్మంపై పేరుకున్న మృతకణాలు, జిడ్డు, మురికి కూడా వదిలి చర్మం నిగనిగలాడుతుంది.
ఇవి కూడా చదవండి :
Minister Komatireddy|| నాపై ఇలాంటి అబండాలు వేయడం కరెక్ట్ కాదు: మంత్రి కోమటిరెడ్డి
Child Kidnapping : చిన్నపిల్లల కిడ్నాప్ పాల్పడుతున్న ముఠా అరెస్ట్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram