Beauty tips | రోజూ ఈ మ్యాజిక్‌ డ్రింక్‌ తీసుకుంటే నెలరోజుల్లో మీ బొర్ర తగ్గిపోవడం పక్కా..!

Beauty tips : సాధారణంగా కొందరు చూడటానికి సన్నగానే ఉంటారు. కానీ వారి బొర్ర మాత్రం లావుగా ఉంటుంది. గంటల తరబడి కూర్చుని పని చేయడంవల్ల, ఆహారపు అలవాట్ల వల్ల, ఒత్తిడి కారణంగా, మద్యపానంవల్ల, శరీరానికి కావాల్సినంత శ్రమ లేకపోవడంవల్ల పొట్ట చుట్టూ కొవ్వు (Belly fat) పేరుకుపోతుంది.

  • Publish Date - May 31, 2024 / 03:00 PM IST

Beauty tips : సాధారణంగా కొందరు చూడటానికి సన్నగానే ఉంటారు. కానీ వారి బొర్ర మాత్రం లావుగా ఉంటుంది. గంటల తరబడి కూర్చుని పని చేయడంవల్ల, ఆహారపు అలవాట్ల వల్ల, ఒత్తిడి కారణంగా, మద్యపానంవల్ల, శరీరానికి కావాల్సినంత శ్రమ లేకపోవడంవల్ల పొట్ట చుట్టూ కొవ్వు (Belly fat) పేరుకుపోతుంది. ఈ పొట్ట కొవ్వు కారణంగా బాడీ షేపవుట్ అవుతుంది. అందవిహీనంగా కనిపిస్తారు. ఈ బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఫలితం పొందలేకపోతుంటారు. అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజు ఉదయాన్నే ఈ డ్రింక్ తీసుకుంటే నెలరోజుల్లోనే మీ పొట్ట సన్నబడుతుంది. ఇంతకూ ఆ మ్యాజికల్ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర (Cumin ), ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలు (Anise seeds), ఒక టేబుల్ స్పూన్ మెంతులు (fenugreek) వేసి, ఒక కప్పు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు స్టవ్ ఆన్‌చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. అదేవిధంగా రాత్రి నానబెట్టుకున్న జీలకర్ర, సోంపు, మెంతులను నీటితో సహా వేసుకుని 10 నుంచి 15 నిమిషాలపాటు మరిగించాలి. అనంతరం వడపోసుకుంటే మ్యాజిక్‌ డ్రింక్‌ సిద్ధమవుతుంది. ఈ మ్యాజిక్‌ డ్రింక్‌ను గోరువెచ్చగా చేసుకుని తాగాలి.

ఈ మ్యాజిక్‌ డ్రింక్‌ ఫ్యాట్ కట్టర్ డ్రింక్‌లా పనిచేస్తుంది. రోజూ ఈ డ్రింక్‌ను తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది. బానపొట్ట మెల్లగా నాజూగ్గా మారుతుంది. పైగా ఈ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అదేవిధంగా ముఖంపై మొటిమలు కూడా తొలగిపోతాయి. ఈ డ్రింక్‌ను నిత్యం తీసుకోవడంవల్ల బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలు కూడా తొలగిపోతాయి.

Latest News