Surabhi Santhosh | సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న నటి సురభి సంతోష్.. వరుడు ఎవరంటే..?

Surabhi Santhosh | ఇటీవల సినిమా తారలు పెళ్లి పీటలెక్కతున్నారు. తాజాగా మలయాళ నటి సురభి సంతోష్ సైతం సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నది. బాలీవుడ్ సింగ్ ప్రణవ్ చంద్రన్‌ను వివాహమాడింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నది. ప్రవణ్ ముంబయిలో పుట్టి పెరగ్గా.. స్వస్థలం కేరళలోని పయ్యన్నూరు. సరిగయ లేబుల్ ఆర్టిస్ట్. ఇరుకుటుంబాల సమక్షంలో గత నవంబర్‌లో నిశ్చితార్థం జరిగింది. ఇక సురభి సంతోష్ నటి.
మోడల్, క్లాసికల్ డ్యాన్సర్‌గానూ ప్రవేశం ఉంది. విశేషం ఏంటంటే లాయర్ కూడా. 2018లో విడుదలైన కుంచాకో బోబన్ ‘కుట్టనాదన్ మార్పాప’తో సురభి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ చెల్లెలి పాత్రలో సురభి నటించింది. తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా కనిపించింది. సురభి ప్రస్తుతం ధ్యాన్ శ్రీనివాసన్ సరసన ‘ఆప్ కైసా హో’.. సన్నీ వేన్ నటించిన ‘త్రయం’ సినిమాల్లో నటిస్తున్నది. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నాయి. సురభి మలయాళంతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటించింది. దుష్ట సినిమాతో కన్నడలో నటించింది. సురభి న్యాయవాది కూడా కావడంతో ఎక్కువగా ఆమె సినిమాల్లో నటించడం లేదు.