సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్న బంగ్లా కొన్న తెలుగు భామ‌.. ఖ‌రీదెంతో తెలుసా?

సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్న బంగ్లా కొన్న తెలుగు భామ‌.. ఖ‌రీదెంతో తెలుసా?

మంచి భ‌విష్య‌త్ ఉన్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చిన్న వ‌య‌స్సులోనే ఆత్మ‌హ‌త్య చేసుకొని క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ముంబై బాంద్రాలోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉండే సుశాంత్.. ఆ ఇంట్లోని తన బెడ్ రూమ్ లో ఉరి వేసుకొని క‌న్నుమూసాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సుశాంత్ మృతికి అస‌లు కార‌ణం ఏంట‌నేది బ‌య‌ట‌కి రాలేదు. అయితే సుశాంత్ నివ‌సించిన ఇల్లు చాలా స్పెష‌ల్‌గా ఉంటుంద‌ట‌. స‌ముద్రానికి ఎదురుగా ఉన్న ఈ ప్లాట్‌కు అత‌డు నెల‌కు దాదాపు 4.5 ల‌క్ష‌లు క‌ట్టేవార‌ని, ఆ త‌ర్వాత దానిని కొనుగోలు చేశార‌నే ప్ర‌చారాలు కూడా సాగాయి. అయితే సుశాంత్ మృతి త‌ర్వాత అందులో నివ‌సించేందుకు ఎవ‌రు ఆస‌క్తి చూప‌డం లేదు.

గ‌త కొద్ది రోజులుగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంటిని అమ్మకానికి పెట్టారని, ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు తెలుగు హీరోయిన్ ఆదా శర్మ ఇంట్రస్ట్ చూపిస్తోందని వార్తలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.కేరళ స్టోరీ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఆదాశర్మ.. ఇప్పటి వరకూ తన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది. తనకంటూ సొంతిల్లు ఉండాలనుకున్న ఆమె.. సుశాంత్ ఇంటిని కొనుగోలు చేయనుందని వార్తలు వ‌స్తున్న నేప‌థ్యంలో స్పందించింది. నా ఇల్లు నాకు దైవం లాంటిది. ప్ర‌స్తుతం నా ఇంట్లోనే ఉంటున్నాను. నేను కొనుగోలు చేయాల్సి వస్తే.. ఇలా నేను ఆ విషయాన్ని చెప్పను. నాకు నచ్చినప్పుడు.. నాకు ఇష్టమైన రీతిలో సమయంలో వెల్లడిస్తాను

నేను చెప్పే వరకు ఎవరికి తోచినట్టు వాళ్లు రాసుకొండి అంటూ ఆదాశర్మ కామెంట్ చేసింది. మ‌రి ఆదాశ‌ర్మ క్లారిటీతో రూమ‌ర్స్‌కి చెక్ ప‌డుతుందా లేదా అనేది చూడాలి. ఆదాకి కొన్నాళ్ల నుండి స‌రైన హిట్స్ లేవు. ఇటీవల రిలీజైన కేరళ స్టోరి సినిమాతో తన కెరీర్‌లోనే భారీ హిట్ అందుకున్న ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌త్తా చాటాల‌ని అనుకుంటుంది. ఆదాశ‌ర్మ న‌టించిన ది కేరళ స్టోరి సినిమా సుమారుగా 200 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. కేర‌ళ స్టోరీ సినిమా తర్వాత అదాశర్మకు బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తున్నాయి.