ప‌వ‌న్ క‌ళ్యాణ్ చొక్కా నిండా రక్త‌పు మ‌ర‌కలు.. అలా ఆయ‌న‌ని చూసి అంద‌రు షాక్

  • By: sn    breaking    Mar 13, 2024 11:48 AM IST
ప‌వ‌న్ క‌ళ్యాణ్ చొక్కా నిండా రక్త‌పు మ‌ర‌కలు.. అలా ఆయ‌న‌ని చూసి అంద‌రు షాక్

ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ది. ఆయ‌న‌కి అభిమానులు కాదు భ‌క్తులు ఉన్నారు. ప‌వ‌న్‌ని దేవుడిగా కొలిచే వాళ్లు కోకొల్ల‌లు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల క‌న్నా కూడా ఆయ‌న మంచి మ‌న‌స్సుతోనే ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకున్నాడు. సినిమాల‌తో కోట్లు సంపాదిస్తున్న ప‌వ‌న్ అవి వ‌దిలేసి ప్ర‌జ‌ల కోసం రాజ‌కీయాల‌లోకి వ‌చ్చారు. విలాస‌వంతంగా జీవించ‌గలిగిన కూడా ప్ర‌జ‌ల‌కి ఏదో చేయాల‌నే త‌ప‌న‌తో ఎండ‌, వాన‌ల్ని సైతం లెక్క చేయ‌కుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. త‌న‌ల్ని ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసిన కూడా ప్ర‌జ‌ల కోసం సేవ చేయాల‌నే త‌పన‌తో రాజ‌కీయాల‌లో కొన‌సాగుతూ వ‌స్తున్నారు.

అయితే ప‌వ‌న్ వ్య‌క్తిత్వం ఏంటి, ఆయ‌న మ‌న‌సు ఎలాంటిది ఏంట‌నేది ఆయ‌నకి ద‌గ్గ‌ర‌గా ఉన్న వ్య‌క్తులు ప‌లు సంద‌ర్భాల‌లో చెబుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గురించి చాలా మందికి తెలియని ఓ విషయాన్ని ఇటీవ‌ల ప్ర‌ముఖ కెమెరామెన్ చోటా కే నాయుడు ఇంట‌ర్వ్యూలో చెప్పి అభిమాను రోమాలు నిక్క‌బొడుచుకునేలా చేశాడు. తొలిప్రేమ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ర‌విబాబుతో క్రికెట్ ఆడే స‌న్నివేశాన్ని షూట్ చేస్తున్నాం. అప్పుడు ప‌వన్ క‌ళ్యాణ్ సుమోలో దిగారు. అప్పుడు ఆయ‌న కోసం వేచి చూస్తున్న నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఇక్క‌డ ఏం చేస్తున్నారు అని అడిగారు. మీ కోస‌మే అని చెప్ప‌డంతో స‌రే ప‌దండి వెళ‌దాం అని అన్నారు.

అయితే ఆ స‌మ‌యంలో ఓ వ్యక్తి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని చూసుకుంటూ స్కూట‌ర్ డ్రైవ్ చేస్తున్నాడు. వెన‌క్కి తిరిగి ప‌వ‌న్ చూస్తూ డ్రైవ్ చేస్తుండ‌గా, ముందున్న కారును గ‌మ‌నించ‌కుండా ఢీకొట్టాడు. దీంతో అత‌ను గాల్లోకి ఎగిరి కింద‌ప‌డ‌డంతో బాగా దెబ్బ‌లు తిగిలాయి. అప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెంట‌నే ప‌రుగెత్తుకుంటూ వెళ్లి అత‌డిని త‌న చేతుల‌తో ఎత్తుకొని త‌న సుమోలో ఎక్కించి ఆసుప‌త్రికి పంపించాడు. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ బ‌ట్ట‌ల నిండా రక్త‌మే ఉంది. షూటింగ్‌లో ఉన్న విష‌యం కూడా మ‌రిచిపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రో తెలియ‌ని మ‌నిషికి సాయం చేయ‌డం అత‌ని గొప్ప మ‌న‌సుకి అద్ధం ప‌డుతుందని చోటా కే నాయుడు అన్నారు.