అడ్డంగా దొరికిపోయిన సందీప్ రెడ్డి వంగా.. అర్జున్ రెడ్డికి సీక్వెల్‌గా యానిమ‌ల్‌

  • By: sn    breaking    Nov 29, 2023 11:30 AM IST
అడ్డంగా దొరికిపోయిన సందీప్ రెడ్డి వంగా.. అర్జున్ రెడ్డికి సీక్వెల్‌గా యానిమ‌ల్‌

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్వకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం యానిమ‌ల్‌. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో అంచనాలకు అనుగుణంగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లను రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.100 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు వస్తున్న స్పందన జవాన్, పఠాన్, టైగర్ 3, గదర్ 2 స్థాయిలో ఉండటంతో సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ అవుతుంది. అంతేకాకుండా ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

యానిమల్ చిత్రం కోసం తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా చూద్దామ‌ని తెగ ఆస‌క్తి చూపుతున్నారు. అయితే ఈ సినిమా జ‌గ‌న్ బ‌యోపిక్ అని కొంద‌రు చెబుతుండ‌గా,మరి కొంద‌రు ఈ మూవీ అర్జున్ రెడ్డికి సీక్వెల్ అని అంటున్నారు. ఈ క్ర‌మంలో సందీప్‌కి వీటి గురించి ప‌లు ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. యాంకర్‌.. ఇది `అర్జున్‌రెడ్డి`కి సీక్వెలా? అని ప్రశ్నించగా, కాసేపు సమాధానం చెప్పలేకపోయాడు సందీప్‌. అవునా, అలా అనిపిస్తుందా? అంటూ కొంత ఆలోచనలో పడి ఆ త‌ర్వాత‌, ఏమో అండి నాకు అలా అనిపించడం లేదు, మీకు అలా అనిపిస్తుందా?, టీజర్‌, ట్రైలర్, పాటలు ఇలా ఏది చూసినా అలానే అనిపించిందా? అంటూ కవర్‌ చేసే ప్రయత్నం చేశారు. యాంకర్‌ అవునూ అని చెప్ప‌గా సందీప్ అలానే ఉండిపోవ‌డం విశేషం.

అడ్డంగా దొరికిపోయిన సందీప్ రెడ్డి వంగా.. అర్జున్ రెడ్డికి సీక్వెల్‌గా యానిమ‌ల్‌అడ్డంగా దొరికిపోయిన సందీప్ రెడ్డి వంగా.. అర్జున్ రెడ్డికి సీక్వెల్‌గా యానిమ‌ల్‌`అర్జున్‌రెడ్డి`లో హీరో లవర్‌ మీద ఎక్స్ ట్రీమ్‌గా లవ్‌, ఎమోషన్‌ని ఎక్స్ ప్రెస్‌ చేశాడు, ఇందులో తండ్రి ప్రేమ మీద ఎక్స్ ట్రీమ్‌గా ప్రేమని, భావోద్వేగాలను ఎక్స్ ప్రెస్‌ చేశాడని యాంక‌ర్ అని అన‌డంతో సందీప్ రెడ్డి వండ‌గా అలా అనిపిస్తుందా అంటూ స‌మాధానం ఇవ్వ‌లేక‌పోయాడు. ఇప్పుడు యానిమ‌ల్ చిత్రం అర్జున్ రెడ్డికి సీక్వెల్‌గా ఉంటుంద‌ని చాలా మంది అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. `అర్జున్‌రెడ్డి`కి పెళ్లైతే, ఆ తర్వాత తండ్రి ప్రేమ కోసం అతను పడే సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, దీనిపై ద‌ర్శ‌కుడు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేక‌పోవ‌డం విశేషం. వీట‌న్నింటికి డిసెంబ‌ర్ 1న క్లారిటీ రానుంది.