Nilgiri Tahr: దేశంలో అరుదైన జంతువు.. ఇక కనిపించకుండా పోతుందా?

Nilgiri tahr: మనదేశంలోని అడవుల్లో ఎన్నో వింత జంతువులు, అతి భయంకరమైన జంతువులు ఉన్నాయి. వీటిలో కొన్ని జంతువులు మాత్రమే అత్యంత అరుదైనవి. వాటి రూపం, జీవన విధానం ఆధారంగా ఇవి అరుదైన జంతు జాబితాలో మిగిలిపోతాయి. అయితే ప్రస్తుతం మన దేశంలోని అడవుల్లో ఉండే ఓ జంతువు కనుమరుగు కాబోతున్నదని జంతుప్రేమికులు చెబుతున్నారు. అదే నీలగిరి తహార్. దీని శాస్త్రీయనామం నీలగిరిట్రాగస్ హైలోక్రియస్. ఇప్పుడు ఈ జంతువు అరుదుగా మాత్రమే కనిపిస్తున్నదట.
నీలగిరి తహార్ మేకను పోలిఉండే ఒక అరుదైన జంతువు. ఇది పశ్చిమ కనుమల్లోని తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని నీలగిరి కొండలు.. అన్నామలై కొండల్లో ఈ జంతువు ఉంటుంది. మేకను పోలి ఉండే ఈ జంతువు అత్యంత అరుదైనది.
1,200 నుండి 2,600 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరాలపై నివసిస్తుంది. దీని రూపం చాలా విచిత్రంగా ఉంటుంది. అంతేకాకుండా కొమ్ములు కూడా వంగినట్టుగా కనిపిస్తాయి. దీని శరీరం దాదాపుగా గోధుమరంగులో ఉంటుంది. ఈ జంతువు చాలా చురుగ్గా కదులుతూ ఉంటుంది.
అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు వేల నుంచి మూడు వేల వరకు మాత్రమే నీలగిరి తాహార్ లు ఉన్నాయని జంతుప్రేమికులు చెబుతున్నారు. అందుకే దీన్ని అరుదైన జాతిగా చెబుతున్నారు. ప్రస్తుతం నీలగిరి తాహరల్ లో కేరళలోని నేషనల్ పార్క్.. తమిళనాడులోని ముకుర్తి నేషనల్ పార్క్ లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎత్తైన కొండలు అంతరించిపోతుండటంత.. అటవీ విస్తీర్ణం తగ్గుతుండటంతో ఈ జంతువులు అంతరించి పోయే జాబితాలోకి చేరిపోతున్నాయని జంతుప్రేమికులు చెబుతున్నారు.
ఈ జంతువును కాపాడేందుకు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకుంటన్నాయి. మనదేశంలోని అడవుల జీవ వైవిధ్యానికి ఇటువంటి జంతువులు ప్రతీకగా నిలుస్తాయని.. కాబట్టి ప్రభుత్వాలు చొరవ తీసుకొని వీటిని కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.