ఎవరైన నాతో గంట మాట్లాడాలి అంటే రూ.5 లక్షలు చెల్లించాలి.. స్టార్ డైరెక్టర్ డిమాండ్ మాములుగా లేదు

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. గ్యాంగ్స్ ఆఫ్ వస్పూర్, బాంబే టాకీస్, బాంబే వెల్వెట్, అగ్లీ, లస్ట్ స్టోరీస్.. లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసి మంచి పేరు సంపాదించుకున్నాడు. దర్శకుడిగానే కాకుండా డా ప్రొడ్యూసర్ గా, నటుడిగా కూడా ఆయన ప్రేక్షకులని అలరించారు. 1997లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన ఏదో విధంగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. నెట్టింట ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనురాగ్ అనేక విషయాలపై స్పందిస్తూ ఆసక్తికరమైన పోస్ట్‌లు చేస్తుంటారు. తాజాగా ఆయన ఇన్‌స్టా పోస్ట్‌లో మాట్లాడాలంటే 15 నిమిషాలకు లక్ష రూపాయలు, అరగంటకు 2 లక్షలు, అదే గంట సేపు అయితే 5 లక్షలు చెల్లించాలని చెప్పుకొచ్చాడు.
నేను “చాలా మంది కొత్తవారికి అవకాశం ఇచ్చి స్టార్ యాక్టర్స్‌గా తీర్చిదిద్దాను. వారిలో కొందరు లో క్వాలిటీ సినిమాలు, కమర్షియలు సినిమాలు చేస్తూ ఉన్నారు. నేను కొత్తవారికి సాయం చేస్తూ వారికి సలహాలు, సూచనలు ఇస్తూ ఎక్కువ సమయాన్ని వృధా చేశాను. మేము తెలివైన వాళ్లం, టాలెంట్ ఉన్న వాళ్లం అని భావించే వారితో మాట్లాడుతూ ఇక టైమ్ వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఇప్పటి నుండి ఏ పని కూడా నేను ఫ్రీగా చేయనంటూ అనురాగ్ కశ్యప్ అన్నారు. ఎవరిని ఊరికనే కలవను, అలానే ఎవరితో ఉట్టిగా మాట్లాడను. ప్రతి దానికి ఒక రేటు ఉంటుందని చెప్పుకొచ్చారు అనురాగ్ కశ్యప్.
ఇక డబ్బులు ఇవ్వలేని వాళ్లు.. కాల్స్ చేసేవాళ్లు.. టెక్ట్స్ మెసేజ్ చేసేవాళ్లు నాకు దూరంగా ఉండడం మంచిది…షార్ట్ సమయంలో విజయం సాధించాలని షార్ట్ కట్స్ వెతుక్కుంటూ వచ్చే వాళ్లను చూసి నేను చాలా విసిగిపోయాను. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది. ఎవరైన నన్ను కలవాలి అంటే డబ్బులు చెల్లించాల్సిందే అని అనురాగ్ చెప్పాడు. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ చేసిన పోస్ట్ సోషళ్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక ఈ పోస్ట్‌పై నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఇదేదో కొత్త బిజినెస్ బాగుందిగా, దీంతో ఎన్ని కోట్లు సంపాదిస్తావో అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.