సీజన్7లో తొలి ఫైనలిస్ట్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్.. అమర్ ఆశలు గల్లంతు

గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ హౌజ్‌లో టికెట్ ఫినాలే అస్త్ర కోసం ఫైట్ నడుస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ పలు టాస్క్‌లు ఇస్తూ ఆ టాస్క్‌లలో మంచి ప్రదర్శన కనబరిచిన వారికి ఎక్కువ పాయింట్స్, మిగతా వారికి తక్కువ పాయింట్స్ ఇస్తూ వచ్చారు. అయితే తాజా ఎపిసోడ్‌లో గౌతమ్ కి తక్కువ పాయింట్స్ రావడంతో అతను రేస్ నుండి తప్పుకోవలసి వచ్చింది. అయితే అతని పాయింట్స్ ఎవరో ఒకరికి ఇవ్వాలి కాబట్టి ప్రియాంకకి ఇచ్చిన మాట ప్రకారం వాటిని అమర్‌కి త్యాగం చేశాడు. ఇక కొద్ది రోజులుగా టాస్క్‌లలో కంటెస్టెంట్స్ ఎక్కువ కష్టపడుతున్నారు కాబట్టి వారు కాస్త ఎక్కువ సేపు పడుకునే అవకాశం ఇచ్చారు. అలానే టీ కూడా పంపారు.
అయితే టాస్క్‌లు ముగిసాక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లవ్ స్టోరీస్ చెప్పాలని ఆదేశించాడు. ముందుగా శివాజీ తన భార్యకి తనకి మధ్య జరిగిన ప్రేమ కథ వివరించి అదరహో అనిపించారు. ఇక శోభా శెట్టి తన ప్రేమ కథ వివరిస్తూ.. లాక్ డౌన్ లో పరిచయం జరిగింది. ఇద్దరం వీడియో కాల్స్ తో మాట్లాడుకునే వాళ్ళం. అతడి పేరు యశ్వంత్ రెడ్డి. త్వరలోనే అతడినే పెళ్లి చేసుకోబోతున్నా, అతనే నాకు సర్వస్వం అని తెలిపింది. ఇక గౌతమ్ తన బ్రేకప్ స్టోరీని చెప్పాడు. ఇలా ఒక్కొక్కరు తమ లవ్ స్టోరీ చెప్పుకుంటూ వచ్చారు. అనంతరం అర్జున్, అమర్, ప్రశాంత్ మధ్య టాస్క్ జరగగా, ఈ టాస్క్ ప్రకారం ముగ్గురూ ఒక తాడు మధ్యలో ఉంటారు. అయితే వారు బలం ఉపయోగించి ఎవరి బుట్టలో వారు జెండాలు వేయాల్సి ఉంటుంది.
అర్జున్ ఎక్కువ బలం ఉపయోగించడంతో అతను విజయం సాధించగా, అమర్ దీప్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ప్రశాంత్ కి తక్కువ పాయింట్స్ ఉండడంతో టికెట్ ఫినాలే అస్త్ర రేస్ నుంచి ప్రశాంత్ తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే టికెట్ ఫినాలే అస్త్ర ఫైనల్ కంటెండర్స్ గా అమర్, అర్జున్ మధ్య పాముతో చెలగాటం అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో వీరిద్దరి ముందు రెండు పాము కటౌట్స్ పెట్టారు.. పాము నోట్లోకి అక్కడున్న పరికరం సహాయంతో బాల్స్ వేయాల్సి ఉండగా, ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వారే విజేత అని తెలిపాడు బిగ్ బాస్. అర్జున్ ఎక్కువ బంతులని పాము నోట్లో వేసి విజయం సాధించడంతో బిగ్ బాస్ అతడికి టికెట్ ఫినాలే అస్త్ర అందించారు. దీంతో టికెట్ ఫినాలే అస్త్ర దక్కించుకొని ఫైనల్ వీక్ కి ఎంట్రీ ఇచ్చిన తొలి కంటెస్టెంట్ గా అర్జున్ నిలిచాడు. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.