సీరియ‌ల్‌పై బ్యాచ్‌పై క‌స్సుబుస్సులాడిన నాగార్జున‌.. మ‌రీ ఇంత దారుణ‌మా?

సీరియ‌ల్‌పై బ్యాచ్‌పై క‌స్సుబుస్సులాడిన నాగార్జున‌.. మ‌రీ ఇంత దారుణ‌మా?

శ‌నివారం వ‌చ్చిందంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి నాగార్జున లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ ఇవ్వ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజా ఎపిసోడ్‌లో సీరియ‌ల్ బ్యాచ్‌కి గ‌ట్టిగా ఇచ్చిప‌డేసాడు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేష‌న్ కాగా, శనివారం ఎపిసోడ్ లో సెల్ఫ్ నామినేష‌న్ వేసుకున్న అశ్విని బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆదివారం మ‌రొక‌రు ఎలిమినేట్ కానున్నారు. అయితే ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ ద‌గ్గ‌ర ఎవిక్ష‌న్ పాస్ ఉండ‌గా, ఆయ‌న దానిని 14వ వారంలో ఉపయోగించాలని డిసైడ్ అయినట్లు నాగార్జున‌కి చెప్పుకొచ్చాడు. ఇక సీరియ‌ల్ బ్యాచ్ గుట్టు బయటపెట్టేశారు నాగార్జున. ముఖ్యంగా ప్రియాంక చేసిన పనిని వీడియో వేసి మరీ కడిగిపారేశారు. ఇక ఎప్పటిలాగే నాగార్జున ముందు తప్పు ఒప్పుకొని క్షమాపణలు కోరింది.

సీక్రెట్ టాస్కు జరుగుతున్న సమయంలో శోభాశెట్టిని పిలిచి సీక్రెట్‌గా ఓ విష‌యం చెప్ప‌గా, అదేంట‌ని నాగార్జున అడిగారు. అప్పుడు ప్రియాంక లైట్ తీసుకుంది. ఈ సారి గ‌ట్టిగా అడిగారు నాగ్. అప్పుడు వీఐపీ వాష్ రూమ్ మాత్రమే ఉపయోగించుకో అని చెప్పినట్లు పేర్కొంది. ఎందుకు అలా చెప్పావ్ అని అని అడగ్గా.. తను డెడ్ అవ్వాలని అనుకోలేదు అంటూ ఆన్సర్ ఇచ్చింది. గ‌తంలో నాకు సాయం చేసింది. అందుకే ఆమె డెడ్ కాకూడ‌ద‌ని అలా చేసానంట‌గూ ప్రియాంక చెప్పగా, దీనిపై నాగ్ ఫుల్ సీరియ‌స్ అయ్యారు. నువ్వు శోభాకు, శోభా అమర్ కు చెప్పుకోవడమా.. ఇది గేమ్ లాగా ఉందా అస‌లు. మీరు ఏం ఆట ఆడుతున్నారనేది అర్ధ‌మ‌వుతుందా అంటూ ఫుల్ సీరియ‌స్ అయ్యారు నాగ్.

ఇక శివాజీని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్ .. నీకు గాయం తగిలింది. భుజం ఎలా ఉందని అడిగాడు. నొప్పి పూర్తిగా తగ్గలేదని పేర్కొన్నాడు. అయితే ఇకపై నీ ఆరోగ్యం నీదే బాధ్యత. బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అనుకుంటే ఉండొచ్చు లేదా వెళ్లిపోవచ్చని అని బిగ్ బాస్ చెప్ప‌డంతో కొంత సేపు ఆలోచించుకొని తాను వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యాడు. కాని నాగార్జున శివాజిని క‌న్ఫెష‌న్ రూమ్‌కి పిలిచి వెళ్ళిపోతావా అని అడిగాడు. వెళ్ళిపోతా అని శివాజీ అన్నాడు. అయితే నాగార్జున ధైర్యం చెప్పి.. నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పు. అప్పటి వరకు హౌస్లో ఉండంటూ చెప్ప‌డంతో శివాజి తిరిగి హౌజ్ లో ఉన్నాడు.