తెగేదాక లాగారు… కెప్టెన్సీ టాస్క్ రద్దు చేసి షాకిచ్చిన బిగ్ బాస్

బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. గత వారం యావర్‌కి ఎవిక్షన్ పాస్ దక్కిన కూడా తనంతట తానే దానిని వద్దనేలా చేశాడు బిగ్ బాస్. ఇక ఇప్పుడు చివరి కెప్టెన్సీ టాస్క్‌లో ఏ నిర్ణయానికి రాకపోవడంతో ఏకంగా రద్దు చేసి పెద్ద షాకిచ్చాడు బిగ్ బాస్. కెప్టెన్సీ టాస్క్ లో ఇద్దరు ఒక్క మాటమీదకు వచ్చి గేమ్‌లో ఉన్న అర్జున్, అమర్‌లలో ఒకరిని తొలగించాల్సి ఉంటుంది. శివాజి, శోభా శెట్టి చేతులలో ఈ నిర్ణయం ఉంది. శోభానేమో అమర్‌కి సపోర్ట్ చేయగా, శివాజి.. అర్జున్‌కి తన సపోర్ట్ అందించాడు.
అర్జున్ వైఫ్ తన భర్తని కెప్టెన్ చేయమని అడిగిందని, అతనికి సపోర్ట్ చేస్తానని తాను మాట ఇచ్చానంటూ శివాజి పట్టుకు కూర్చున్నాడు. అయితే అమర్‌కి కూడా శివాజి మాట ఇచ్చాడు. తప్పక సపోర్ట్ చేస్తానని అన్నాడు. అయితే అర్జున్, అమర్ రేసులో ఉండడంతో ఎవరికి సపోర్ట్ అంటే తాను అర్జున్‌కే అని గట్టిగా పట్టుకు కూర్చున్నాడు. తనకు అవకాశం ఇమ్మని అమర్ దీప్ వేడుకుంటూ, చేతులెత్తి మొక్కాడు, చివరగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయిన శివాజీ తన మాట మీద నిలబడినట్టు చెప్పాడు. అయితే అమర్ దీప్ వేడుకున్న విధానం చూస్తే ఎవరైన కరిగిపోతారు. కాని శివాజి మనసులో ఏముందో తెలియదు కాని అమర్ దీప్ ఎంత వేడుకున్నా మనోడు కరగలేదు.
బిగ్ బాస్ హెచ్చరించినా కూడా దానిని సాగదీసుకుంటూ వెళ్లారు. దాంతో ఆ టైమ్ దాటిపోయింది. దీంతో బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అంతలోనే శివాజీ అమర్ కి సపోర్ట్ చేశాడు. కాకపోతే అప్పటికే అర్జున్‌తోపాటు అమర్ దీప్ ఫోటో కూడా కాలిపోయింది. దీంతో అందరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. చివరి ఛాన్స్ కూడా అమర్‌కి దక్కకపోవడంతో మనోడి బాధ వర్ణనాతీతం. మరి ఈ వారం క్యాన్సిల్ చేసినందుకు వచ్చే వారం ఏమైన ఉంటుందా, లేదంటే నాగార్జున ఈ రోజు మరేదైన ట్విస్ట్ ఇస్తారా అనేది చూడాలి. ఇక 12 వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పిన నాగార్జున ఈ రోజు ఒకరు, రేపు ఒకరిని హౌజ్ నుండి బయటకు పంపిస్తాడా అనేది చూడాలి. ప్రస్తుతం నామినేషన్లలో శివాజీ, ప్రశాంత్, అర్జున్, అమర్ దీప్, అశ్విని, గౌతమ్, రతిక, యావర్ ఉన్నారు.