వాళ్లిద్దరిపై అమ‌ర్‌కి క‌ట్ట‌లు తెంచుకున్న కోపం..మిత్ర‌ద్రోహి అంటూ ఫైర్

వాళ్లిద్దరిపై అమ‌ర్‌కి క‌ట్ట‌లు తెంచుకున్న కోపం..మిత్ర‌ద్రోహి అంటూ ఫైర్

బిగ్ బాస్ అంటే గొడవలు, గ్రూపులు, లవ్వులు, ఫ్రెండ్షిప్పులు, ద్వేషాలు, నాగార్జున క్లాసులు ఇలా ఎన్నో ఉంటాయ‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.ప్ర‌స్తుతం హౌజ్‌లో శివాజీ, గౌతమ్, యావర్, ప్రశాంత్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అమర్ దీప్, అర్జున్ అంబటి, అశ్విని శ్రీ, రతికా రోజ్ ఉండ‌గా వీరు ఎవరి స్టైల్‌లో వారు గేమ్ ఆడుతున్నారు.ఈ సీజ‌న్ అంతా ఉల్టా పుల్టా కాబ‌ట్టి అనుకున్న‌ది ఒక్క‌టి అయితే జ‌రిగేది మ‌రొక్క‌టి. మరో నాలుగు వారాల్లో ఈ సీజన్ ముగియనుండ‌గా, టాప్ 5లో నిలిచేందుకు ప్ర‌తి ఒక్క‌రు గట్టిగానే కృషి చేస్తున్నారు. అయితే శుక్రవారం ఎపిసోడ్ చాలా ఆస‌క్తిగా సాగింది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ప్ర‌తి ఒక్క‌రు క‌సిగా ఆడ‌గా, చివ‌రికి చివరకి ప్రియాంక విజయం సాధించి హౌస్ కి కొత్త కెప్టెన్ గా అవతరించింది.

ఎవిక్ష‌న్ పాస్ టాస్క్‌లో చివ‌రికి యావ‌ర్ విజ‌యం సాధించ‌గా, అత‌నికి ఆ పాస్ ద‌క్కింది. ఎవిక్ష‌న్ పాస్ విష‌యంలో శోభాశెట్టి త‌ప్పుడు వాద‌న వినిపించ‌గా, ఆ స‌మ‌యంలో శోభాతో శివాజీ గొడ‌వ‌ప‌డ్డాడు. రిజ‌ల్డ్ ఇచ్చిన త‌ర్వాత గుడ్ డెసిష‌న్ అంటూ ఆమెని అభినందించాడు. ఇక శివాజి గొడ‌వ విష‌యంలో అర్జున్ ..శోభాతో మాట్లాడుతూ.. శివాజీ ఎప్పుడూ రెండు విధాలుగా మాట్లాడతారు. ఎప్పుడు ఎలా అవసరమో ఆ వైపు జంప్ అయిపోతారు అని చెప్పాడు. శివాజీకి తప్పించుకోవడం బాగా తెలుసు అని గౌతమ్ తెలిపాడు. ఇక బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ ప్రారంభం కాగా, టాస్క్‌లో ఇంటి సభ్యులంతా కంటెండర్స్ గా పాల్గొన్నారు. అమర్చిన రూట్ లో వెళుతూ ఎక్కువ ఇటుకలు సేకరించిన వారు గేమ్‌లో నిలుస్తారు. త‌క్కువ ఇటుక‌లు సేక‌రించిన వారు కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకుంటూ వస్తారు అని బిగ్ బాస్ తెలిపారు.

ఎక్కువ ఇటుకలు సేక‌రించి టాప్ 4 లో నిలిచిన వాళ్ళు లెవల్ 2 కి వెళతారు. ఆ విధంగా అమర్, ప్రియాంక, అర్జున్, ప్రశాంత్ ఎక్కువ ఇటుకలతో త‌ర్వాత రౌండ్‌కి వెళ్లారు. ఇక లెవ‌ల్ 2లో సేకరించిన ఇటుకలని టవర్ లాగా ఎత్తుగా పేర్చాల్సి ఉంటుంది. ఎవ‌రి ట‌వర్ అయితే తక్కువ ఎత్తు ఉంటుందో వాళ్లు తప్పుకుంటారు. ఇక చివరకి మిగిలింది ప్రియాంక, అమర్ కాగా.. ఇందులో ఎవరు కెప్టెన్ కాకూడదు అనుకుంటున్నారో వారి టవర్ పై బాల్స్ తో దాడి చేయొచ్చు అని బిగ్ బాస్ చెబుతాడు. అయితే అంద‌రు అమ‌ర్ ట‌వ‌ర్‌ని టార్గెట్ చేస్తుండ‌డంతో అత‌నిలో ఆగ్ర‌హం కట్టలు తెంచుకుంటుంది. ఒక వైపు నుంచి రతిక, మరోవైపు నుంచి గౌతమ్ టార్గెట్ చేయడంతో స‌హ‌నం కోల్పోయిన అమ‌ర్… ఏం మనిషివే నువ్వు అంటూ రతికపై.. మిత్ర ద్రోహి అంటూ గౌతమ్ పై గ‌ట్టిగా అరుస్తూ నానా ర‌చ్చ చేస్తాడు. చివరకి ప్రియాంక నే విజయం సాధించి హౌస్ కి కొత్త కెప్టెన్ కావ‌డంతో అంద‌రు ఆమెని అభినందిస్తారు.