ఫిబ్రవరిలో బాక్సాఫీస్ షేక్ కావల్సిందే.. ఎన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయంటే..!

సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు విడుదల కాగా, ఇవి ప్రేక్షకులకి మంచి వినోదాన్నే పంచాయి. ముఖ్యంగా హనుమాన్ సినిమా మంచి వినోదాన్ని పంచింది. అయితే జనవరి నెల మరో రెండు రోజులలో ముగియనుంది. ఫిబ్రవరిలో ఏయే సినిమాలు థియేటర్స్‌లో రాబోతున్నాయి అని ప్రేక్షకులు వెదుకులాట మొదలు పెట్టారు.అయితే ఫిబ్రవరి నెలలో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రవితేజ, వరుణ్‌తేజ్‌తో పాటు పలువురు యంగ్ హీరోలు సిద్ధమవుతోన్నారు. ముందుగా కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సక్సెస్‌ల తర్వాత సుహాస్ హీరోగా వస్తున్న చిత్రం అంబాజీపేట మ్యారేజీబ్యాండు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న విడుదల చేయనున్నారు.
అంబాజీపేట మ్యారేజీబ్యాండుతో పాటు ఫిబ్రవరి 2న బిగ్ బాస్ సోహెల్ బూట్‌కట్ బాలరాజు కూడా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలతో పాటు గేమ్ ఆన్, కిస్మత్, హ్యాపీ ఎండింగ్ మూవీస్ ఫిబ్రవరి తొలి వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక రెండో వారంలో చూస్తే యాత్ర 2, రవితేజ ఈగల్ సందీప్‌కిషన్ ఊరు పేరు భైరవకోన సినిమాలతో పాటు రజనీకాంత్ లాల్ సలాం ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ సినిమాలన్నింటినిపై కూడా అభిమానులలో ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక సంక్రాంతికి రావల్సిన రవితేజ ఈగల్ ఫిబ్రవరి 9న విడుదల కానుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాకి పోటీగా థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోనతో సందీప్‌కిషన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫిబ్రవరి 9న రజనీకాంత్ డబ్బింగ్ చిత్రం లాల్ సలాం తెలుగు ఆడియెన్స్ ముందుకు రానున్నది.
ఫిబ్రవరి మూడో వారంలో మెగా హీరో వరుణ్‌తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంతో పలకరించనున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది. ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెట్టుకున్నాడు. ఇక మాస్ మహారాజా రవితేజ నిర్మించిన సుందరం మాస్టర్ ఫిబ్రవరి 16న విడుదలకానుంది. ఇందులో కమెడియన్ వైవా హర్ష హీరోగా నటిస్తున్నాడు. ఇక నా సామిరంగతో చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్న రాజ్ తరుణ్ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం తిరుగబడరా సామి.. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సీనియర్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించాడు. ఇక సంతోష్ శోభన్ హీరోగా నటించిన జోరుగా హుషారుగా మూవీ ఫిబ్రవరి 29న రిలీజ్‌కి సిద్ధమైంది. ఇలా వైవిధ్యమైన సినిమాలు ఫిబ్రవరి నెలలో ప్రేక్షకులని సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.