Eagle Force Nabs Key Hawala Kingpin | ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్..3కోట్ల హవాలా నగదు స్వాధీనం
డ్రగ్స్ కట్టడిలో భాగంగా ఈగల్ టీమ్ నైజీరియా డ్రగ్ కార్టెల్ నెట్‌వర్క్‌ను ఛేదించింది. డ్రగ్ మనీ లాండరింగ్ కింగ్‌పిన్ దర్గారం ప్రజాపతిని అరెస్టు చేసి, రూ.3 కోట్ల హవాలా నగదును స్వాధీనం చేసుకుంది.

విధాత: డ్రగ్స్ కట్టడికి వరుస ఆపరేషన్లు నిర్వహిస్తున్న ఈగల్ టీమ్ మరో విజయం సాధించింది. నైజీరియా డ్రగ్ కార్టెల్‌కు డబ్బు సరఫరా చేసిన నెట్వర్క్ ని చేధించింది. డ్రగ్ మనీ లాండరింగ్ కింగ్‌పిన్ దర్గారం ప్రజాపతిని ఈగల్ పోలీస్ టీమ్ అరెస్టు చేసింది.
ముంబైలో అతని నివాసం నుంచి రూ.3 కోట్ల హవాలా డబ్బును స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 14 మంది ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు ఉండటం గమనార్హం.నకిలీ పాస్‌పోర్ట్‌లతో విదేశీయులు భారత్‌లోకి వస్తున్నట్లు ఈగల్ పోలీసులు ఈ కేసు విచారణలో గుర్తించారు.