తేజ బట్టలు విప్పిన అమర్.. బాయ్స్‌తో కుస్తీ పడ్డ అశ్విని

బిగ్ బాస్ సీజన్ 7లో ఇటు మాటల తూటాలతో పాటు మాస్ మసాలా కూడా మంచిగా యాడ్ అవుతుంది. ఒకవైపు అందాల భామలు క్లీవేజ్ షో, అటు థైస్ షోతో నానా రచ్చ చేస్తుంటే మేమేమి తక్కువ తినలేదు అంటూ బాయ్స్ కూడా షర్ట్ లెస్ గా తిరుగుతూ హంగామా చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో టాస్క్‌లో భాగంగా తేజ దుస్తులు ఒక్కొక్కటి విప్పడం అందరిని ఆశ్చర్యపరచింది. ముందుగా కెప్టెన్సీ కంటెండర్స్ గా అర్హత సాధించడం కోసం బిగ్ బాస్ కొన్ని టాస్క్ లు నిర్వహించారు. ముందుగా స్టోరిట్ పోరిట్ అనే గేమ్ ఆడించగా, ఈ గేమ్ లో అశ్విని, అర్జున్, భోలే, సందీప్ పాల్గొన్నారు. ఈ టాస్క్‌లో భాగంగా ప్రతి ఒక్కరి తలపై స్పాంజ్ లు హెల్మెట్ తరహాలో పెడుతారు.
షవర్ కింద నిలబడి ఆ తర్వాత స్పాంజ్ లలో నీటిని వారి వారి కంటైనర్లలో వాళ్ళు నింపుకోవాల్సి ఉంటుంది.. ఒక షవర్ మాత్రమే ఉంటుంది కాబట్టి పోటీ పడి స్పాంజ్ లు తడుపుకోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ తెలియజేశారు. అయితే ఈ గేమ్‌లో అశ్విని ఒక్కతే మహిళ కావడడంతో ఆమె బాయ్స్ తాకిడి తట్టుకోలేకపోయింది. అయిన గట్టిగానే పోరాడి తొలి రౌండ్ లో భోలే కంటే ఎక్కువ వాటర్ సాధించింది. ఇక భోలే కూడా తన వాటర్ ని అశ్వినికి దానం చేశాడు. అనంతరం అశ్విని సందీప్, అర్జున్ లతో పోటీ పడి వాటర్ సాధించలేకపోవడంతో ఆమె గేమ్ నుంచి తప్పుకుంటూ ఆమె తన వాటర్ ని సందీప్ మాస్టర్ కి ఇచ్చేసింది. దీంతో సందీప్ కి అడ్వాంటేజ్ గా మారింది.
ఈ క్రమంలోనే సందీప్ కెప్టెన్సీ కంటెండర్ గా అర్హత సాధించాడు. ఆ తర్వాత గ్యాప్ లో రతిక, యావర్ మధ్య కొంత డిస్కషన్ నడిచింది. ప్రియాంక మనిద్దరికీ ఎఫైర్ అంటగడుతుందని రతిక యావర్‌కి అనడంతో వాళ్లంతా ఒకే బ్యాచ్ ఆ సంగతి నాకు ముందే తెలుసు అని యావర్ అంటాడు. ఇక ఆ తర్వాత కంటైనర్లలో ఉన్న బాల్స్ ని ఒంటి చేత్తో వేగంగా ఖాళీ చేయాలి అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ గేమ్ లో గౌతమ్ విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్ గా అర్హత పొందారు. లాస్ట్‌కి బిగ్ బాస్ వేగంగా ఎక్కువ బట్టలు ధరించాలంటూ టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్ లో యావర్, తేజ, శోభా శెట్టి పాల్గొన్నానగా, దీనికి శివాజీ సంచాలకుడిగా ఉన్నారు. అయితే ఫలితాల కోసం సంచాలక్ ఒక్కొక్కరి బట్టలు తీసి లెక్కించాల్సి ఉండగా, శివాజి చేయి బాలేనందున అమర్ సాయం చేశాడు. ఆ సమయంలో తేజ పైన లోదుస్తులు కూడా అమర్ దీప్ విప్పాల్సి వచ్చింది. ఛీ ఛీ అనుకుంటూ అమర్ దీప్ వాటిని విప్పడం కాస్త ఫన్నీగా అనిపించింది. ఇక ఈ గేమ్‌లో శోభా శెట్టి 72 దుస్తులు ధరించి విజయం సాధించింది. చివరకి ప్రియాంక, ప్రశాంత్, గౌతమ్, సందీప్, శోభా శెట్టి కెప్టెన్సీ కంటెండర్స్ గా అర్హత పొందారు. వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి.