గౌతమ్‌కి ఫుల్ క్లాస్ పీకిన నాగ్.. కార్తీతో తెగ సందడి చేసిన హౌజ్‌మేట్స్

బిగ్ బాస్ కార్యక్రమంలో శనివారం ఎపిసోడ్ ఎంత వాడివేడిగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగార్జున ఆ వారంలో హౌజ్‌మేట్స్ చేసిన తప్పులని ఎత్తి చూపిస్తూ అక్షింతలు వేస్తుంటాడు. ముందుగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌ని చూపించిన నాగార్జున ఆ ఎపిసోడ్‌లో హౌజ్‌మేట్స్ చేసిన కొన్ని పనులకి వెరైటీ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంటాడు.శోభ కెప్టెన్ అయిన తర్వాత జరిగిన పరిణామాలను అలానే శోభ, టేస్టీ తేజ మధ్య జరిగిన గొడవను, ప్రిన్స్ , శివాజీల మధ్య వచ్చిన మనస్పర్దలను అన్నింటిని గమనించి ఆ తర్వాత హౌజ్‌మేట్స్ దగ్గరకి వెళతాడు. శివాజీ కారణంగా గౌతమ్, అశ్వినీల మధ్య చర్చ పెద్ద రచ్చకి దారితీయడంతో దానిపై క్లారిటీ తీసుకొచ్చిన నాగార్జున వెంటనే హీరో కార్తీని తీసుకొచ్చి కొద్ది సేపు రిలీఫ్ అయ్యేలా చేస్తారు. కార్తీ నటించిన జపాన్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా కార్తీ బిగ్ బాస్ వేదికపై సందడి చేస్తూ కంటెస్టెంట్స్‌తో సరదాగా సందడి చేస్తాడు.
ఇక కార్తీ వెళ్లిపోయాక కంటెస్టెంట్స్ ఈ వారం పర్ఫార్మెన్స్‌ను కొలవడానికి బంగారం, మట్టి, బొగ్గు అనే మూడు క్యాటగిరీలతో ముందుకు వస్తారు. ముందుగా శోభ ఆట బాగున్న నేపథ్యంలో ఆమె ఫోటోను బంగారం కాలంలో పెట్టేస్తాడు. ఆ తరువాత అమర్ ఆటతీరును కూడా మెచ్చుకొని ఇలాగే ఆడమని చెబుతూ అతని ఫోటోను కూడా బంగారం కాలమ్‌లో పెడతాడు. శివాజీ, ప్రశాంత్, ప్రియాంక ఆటతీరు కూడా.. బంగారమే అంటూ.. వారి వారి ఫోటోలను కూడా బంగారం కేటగిరీలో చేర్చుతాడు. అయితే అర్జున్ ఆటతీరుకు కూడా బంగారం ఇచ్చిన కింగ్ నాగ్.. టాస్కుల్లో కాకుండా రిమైనింగ్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయాలంటూ కొన్ని సూచనలు చేస్తాడు.
ఇక ప్రిన్స్ యావర్‌ని వ్యక్తులపై కాకుండా గేమ్‌పై ఫోకస్ చేయాలని సూచిస్తాడు. రతిక, భోలే ఆటతీరు ఏమాత్రం బాలేదంటూ.. బొగ్గు కాలమ్‌లో వారి ఫోటోలను పెడతాడు నాగ్. ఇక భోలే ఆటతీరుపై నాగార్జున క్లాస్ పీకుతాడు. ఇక తేజ తన ప్లాబ్లమ్ గురించి నాగార్జునకి చెప్పుకోగా, దానికి కరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చాడు. అనంతరం గౌతమ్ తనకు ఓ ఇష్యూ ఉందని చెప్పగా.. కన్ఫెషన్ రూంకు వెళ్లమని.. తన ఇష్యూ ఏంటో చెప్పమన్నాడు. అయితే కెప్టెన్సీ టాస్క్‌లో.. శివాజీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని.. కావాలని తనను కార్నర్ చేసి తప్పించాడని అన్నాడు.ఈ విషయం హౌజ్‌మెంబర్స్ ముందు అడ్రెస్ చేస్తే క్లారిటీ వస్తుందని నాగ్ అనడంతో గౌతమ్ మళ్లీ లివింగ్ ఏరియాలోకి వచ్చిన గౌతమ్ .. అదే విషయం ప్రస్తావించగా, అప్పుడు అందరి ఒపీనియన్ తీసుకుంటున్నాడు నాగ్. అయితే గౌతమ్ హౌజ్‌మేట్స్ మాటలకే కాకుండా నాగార్జున మాటలకి కూడా పదేపదే అడ్డుపడడంతో గట్టిగా క్లాస్ పీకుతాడు. నువ్వు కెప్టెన్ అవకూడదనేది.. ఒక్క శివాజీ డెసీషిన్ కాదని.. ఇట్స్ ఏ కలెక్టివ్ డెసీషన్ అని.. చెబుతాడు. అశ్విని మాటలు విని నువ్వు ఇలా అగ్రెసివ్ అవుతున్నావంటూ క్లాస్ పీకుతాడు. చెప్పుడ వినుడు మాత్రమే కాదు.. ఆ మాటలు గురించి వన్స్ ఆలోచించాలని గౌతమ్‌కు సూచిస్తాడు. పుల్లలు పెట్టడం కాస్త తగ్గించుకోవాలని అశ్వినికి చురకలు అంటిస్తాడు. ఇక ఈ వారం తేజ ఎలిమినేట్ అవుతాడని తెలుస్తుంది.