Warangal | వరదలో కొట్టుకు పోయిన కారు.. తండ్రీకూతురు గల్లంతు

Warangal | భారీ వర్షాలతో వరద బీభత్సం సృష్టిస్తుంది. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి విధ్వంసం జరుగుతుంది. వరద నీటి ప్రవాహంతో వాగులు, కాలువలపై గల వంతెనలు, లో లెవెల్ కాజ్ వేల మీదుగా వరద నీరు ప్రవహిస్తుంది.

Warangal | వరదలో కొట్టుకు పోయిన కారు.. తండ్రీకూతురు గల్లంతు

ఆకేరు వాగు దాటే ప్రయత్నంలో ఘటన

Warangal | వరంగల్ : భారీ వర్షాలతో వరద బీభత్సం సృష్టిస్తుంది. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి విధ్వంసం జరుగుతుంది. వరద నీటి ప్రవాహంతో వాగులు, కాలువలపై గల వంతెనలు, లో లెవెల్ కాజ్ వేల మీదుగా వరద నీరు ప్రవహిస్తుంది. కేసముద్రం మండలంలోని ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక రూట్లలో రాకపోకలు స్తంభించాయి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమయగూడెం శివారులోని ఆకేర్ వాగులో వరద నీటి ప్రవాహానికి ఓ కారు కొట్టుకపోయింది. ఆ కారులో ప్రయాణిస్తున్న తండ్రి కూతురు ఇద్దరూ గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా గేటు కారేపల్లి గంగారముకు చెందిన మోతిలాల్ ఆయన కూతురు అశ్విని కారులో హైదరాబాద్ బయలుదేరారు. అశ్విని ఢిల్లీలో విత్త‌న ప‌రిశోధ‌న శాస్త్ర‌వేత్త‌. ఆమెతో కలిసి తండ్రి మోతిలాల్ కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ దుర్ఘటన జరిగింది. స‌మీపంలోని పామాయిల్ తోట‌లో ఆశ్విని మృత‌దేహం ల‌భ్య‌మైంది. తండ్రి మోతిలాల్ డెడ్‌బాడీ కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

రెండు కాజ్ వేల మధ్య చిక్కుకపోయిన ఆర్టీసీ బస్సు

నెక్కొండ- మహబూబాబాద్ రహదారిలో వెంకటాపురం గ్రామం వద్ద రెండు లో లెవెల్ కాజ్ వేల మధ్య ఆర్టీసీ బస్సు చిక్కుకపోయింది. వేములవాడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాత్రి వెంకటాపురం వద్ద గ్రామం వద్ద చెరువు కింద ఉన్న పంట పొలాలకు నీరు వెళ్లే లో లెవెల్ కాజ్ వే దాటి ముందుకు వెళ్ళింది. సమీపంలో ఎదురుగా ఇదే చెరువు అలుగు నీరు ప్రవహిస్తున్న లో లెవెల్ కాజ్ వే దాటనీయకపోవడం వల్ల బస్సు మధ్యలోనే ఆగిపోయింది. వెనక్కి తిరిగి వద్దామంటే అప్పటికే పంట పొలాలకు నీరు వెళ్లే కాలువపై గల లో లెవెల్ కాజ్ వే మీదుగా ప్రవాహం పెరిగింది. దీంతో ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక రెండు కాజ్ వేల మధ్యలో రహదారిపైనే బస్సు నిలిచిపోయింది. ఈ రెండు కాజ్ వేల మధ్య రోడ్డు దాదాపు 200 మీటర్ల గ్యాప్ ఉంది. ఈ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అందరూ సురక్షితం. తాము చిక్కుకుపోయిన విషయాన్ని అధికారులకు సమాచారం ఇచ్చారు. వీరిని బయటకు తీసుకొచ్చేందుకు నెక్కొండ పోలీసులు ఉదయం వెంకటాపురం గ్రామం వద్దకు చేరుకున్నారు. బస్సులోని ప్రయాణికులను పంట పొలాలకు నీరు వెళ్లే కాజ్ వే మీదుగా బయటకు తీసుకొచ్చే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు.