బిగ్ బాస్ హౌజ్‌లో ఫ్యామిలీల సందడి.. ప్రియుడు రావడంతో ఫుల్ ఖుషీ అయిన ప్రియాంక

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ పదో వారంలోకి అడుగుపెట్టడంతో హౌజ్‌లోకి ఫ్యామిలీ మెంబర్స్‌ని ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే అశ్విని, శివాజీ, అర్జున్ ప్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చి సందడి చేయగా, తాజా ఎపిసోడ్‌లో గౌతమ్ తల్లి వచ్చారు. ఆమె వస్తూ వస్తూ కొడుక్కకి పంచె తీసుకొని వచ్చింది. ఇక తల్లిని చూసి గౌతమ్ చాలా ఎమోషనల్ అయ్యాయి. నా కొడుక్కి అమ్మాయిల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉందని చెప్పి మురిసిపోయింది. గౌతమ్ బాగా ఆట ఆడుతున్నాడని, కాకపోతే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలని, కొన్ని సార్లు మాట జారుతున్నావని కొడుక్కి సలహా ఇచ్చింది. ఇక ఇంట్లో ఉన్న సభ్యులకి గోరు ముద్దలు కూడా తినిపించింది.
గౌతమ్ తల్లి వెళ్లిన కొద్ది సేపటికి ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ వచ్చాడు. ప్రియాంకని గట్టిగా హగ్ చేసుకొని తెగ ముద్దులు ఇచ్చేసాడు. చాలా టైట్ హగ్ ఇచ్చుకుంటూ పెళ్లి గురించి ముచ్చటించుకున్నారు. ఇక శివ అయితే ప్రతి ఒక్కరిని సర్ అంటూ సంభోదిస్తూ అందరి హృదయాలను గెలుచుకున్నాడు .అందరి గురించి బాగా చెప్పాడు. ఇక అశ్విని గురించి మాట్లాడిన శివ.. మిమ్మలని చాలా మంది తొక్కేస్తున్నారని, కానీ మీకోసం మీ అభిమానులం ఉన్నామని, సపోర్ట్ చేస్తామని చెప్పేసరికి ప్రియాంక మొఖంఅయితే వాడిపోయినట్టు అయింది. మరోవైపు అశ్వినిని రోజా పువ్వులా ఉన్నావని ప్రియాంక ముందే కామెంట్ చేశాడు.
అయితే ఈ రోజా పువ్వు తనకే ఇచ్చేయ్ అని ప్రియాంక అనగా, ఒకరికి ఇచ్చింది తాను ఇవ్వలేనని, మరోటి ఇస్తానని శివ చెప్పడం ప్రియాంకకి మరింత మండేలా చేసింది. ఇక శివ.. ప్రియాంకకి హితబోధ చేశాడు. చిన్న చిన్న విషయాలను లాగుతున్నావని, బాగా ఆరుస్తున్నావని, అవి నచ్చడం లేదని తెలిపారు.విషయం ఏదైతే ఉందో అది చెప్పి వదిలేయ్, లాగొద్దు, ఇక్కడ నువ్వు సోలోగో ఆడు. చాలా విషయాలలో నువ్వు మార్చుకోవలసి ఉందని శివ తెలియజేశాడు. ఇక భోలే వైఫ్ చివరిగా హౌజ్‌లోకి వచ్చింది. ఆమె కోసం రెండు మూడు సార్లు పాటలు పాడుతూ అలరించిన భోలే… తన కొడుకు గుర్తొస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. కప్ గెలుచుకుని వస్తానని కాదు, అందరి మనసులను గెలుచుకుని వస్తానంటూ భోలే చెప్పడం విశేషం. ఇక స్కూల్ గేమ్ యదావిధిగా కొనసాగుతుండగా, ప్రశాంత్, అమర్ దీప్ ఇంగ్లీష్‌లో మాట్లాడి నవ్వులు పూయించారు. ఆ తర్వాత పాటలతో అటెండెన్స్ తీసుకునే ఎపిసోడ్ కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.