ఊరించి ఉసూరుమనిపించారుగా.. బిగ్ బాస్ ఓటీటీ ప్రియులకి ఇది పెద్ద షాకే..!

విదేశాలలో మొదలైన బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పుడు మన దేశంలో కూడా దుమ్ము రేపుతుంది. పలు ప్రాంతీయ భాషలలో ఈ షో ప్రసారం అవుతుండగా, దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగులో సక్సెస్ ఫుల్‌గా ఏడు రెగ్యులర్ సీజన్స్‌తో పాటు ఒక ఓటీటీ సీజన్ జరుపుకుంది. అయితే ఇటీవల సీజన్ 7 సూపర్ డూపర్ సక్సెస్ కాగా, ఈ షోని ఉల్టా పుల్టా అంటూ కొత్త కంటెంట్ తో రన్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ దక్కింది. అంతేకాదు ఈ షోలో కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవడంతో షోపై క్రేజ్ మరింత పెరిగింది. ఫినాలే ఎపిసోడ్‌కి కూడా భారీ రేటింగ్ దక్కింది. అయితే తాజా సీజన్‌కి మంచి రెస్పాన్స్ దక్కడంతో బిగ్ బాస్ ఫీవర్ క్యాష్ చేసుకునేందుకు నిర్వాహకులు బిగ్ బాస్ ఓటిటీ సీజన్ 2 ప్రారంభించాలని భావించారు.
కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తి అయ్యిందని, బర్రెలక్క, భోలే షావలి, నయని పావనితో పాటు మరికొందరు పార్టిసిపెంట్స్ ఇందులో సందడి చేయబోతున్నట్టు ప్రచారం కూడా నడిచింది.ఫిబ్రవరి నుండి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ప్రారంభం కానుండగా, దీనికి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోలో సెట్ పనులు కూడా ప్రారంభించినట్టు ప్రచారం జరిగింది. కాని అయితే అనూహ్యంగా షో రద్దు అయ్యిందట. బిగ్ బాస్ సెట్ వేసే స్టూడియోను మరో ఛానల్ కొత్త షో కోసం బుక్ చేసుకుందని టాక్ నడుస్తుంది. కాని అసలు కారణం ఏంటనేది పూర్తిగా తెలియరావడం లేదు. ఇది నిజమైతే బిగ్ బాస్ ఓటిటి సీజన్ 2 కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకి నిరాశే మిగిలింది అని చెప్పాలి.
2022లో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ వన్ ప్రసారం కాగా, ఈ షోకి ఓ మోస్తరు ఆదరణ దక్కించుకుంది. హీరోయిన్ హిమబిందు విజేతగా నిలిచింది. తొలిసారి తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో విజేతగా ఓ అమ్మాయి నిలవడం అందరికి ఆనందం కలిగించింది. అయితే కారణం తెలియదు కానీ… గత ఏడాది ఓటీటీ వెర్షన్ ప్రసారం కాలేదు. సీజన్ 6 అట్టర్ ప్లాప్ కావడం కూడా దీనికి కారణం అని చెప్పవచ్చు. ఇక సీజన్ 7 ఫినాలే ఎపిసోడ్ ఏకంగా 21 టీఆర్పీ తెచ్చుకున్నట్లు సమాచారం. నాగార్జున హోస్టింగ్, కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ అదిరిపోవడంతో షోకి ప్రేక్షకుల బాగా కనెక్ట్ అయ్యారు.