ఉల్టా పుల్టా బాగానే వ‌ర్క‌వుట్ అయిన‌ట్టుంది.. బిగ్‏బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే‏కు రికార్డ్ టీఆర్పీ

ఉల్టా పుల్టా బాగానే వ‌ర్క‌వుట్ అయిన‌ట్టుంది.. బిగ్‏బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే‏కు రికార్డ్ టీఆర్పీ

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి మ‌జా అందిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో ఈ షోకి మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. తెలుగులో మాత్రం ఈ షో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే ఏడు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఒక ఓటీటీ షో కూడా జ‌రుపుకుంది. అయితే సీజ‌న్ 6కి కాస్త రేటింగ్ త‌గ్గ‌డంతో సీజ‌న్ 7 విష‌యంలో మాత్రం నిర్వాహ‌కులు స‌రికొత్త ప్లాన్స్ చేసి మంచి రేటింగ్ ద‌క్కేలా చేశారు. ఉల్టా పుల్టా అంటూ ముందు నుంచే సీజ‌న్ 7పై క్యూరియాసిటీ పెంచినప్పటికీ షో మొదలైన తర్వాత మ‌రీ అంత ట్విస్ట్‌లు ఏమి క‌నిపించ‌లేదు.

మొత్తం హౌజ్‌లోకి 19 మంది కంటెస్టెంట్‌ల‌ని ప్ర‌వేశింప‌జేశారు. ఆ త‌ర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆరుగురు వెళ్లారు. ఎవ‌రికి వారు త‌మ‌దైన శైలిలో గేమ్ ఆడ‌గా, చివ‌రికి ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ విజేత‌గా నిలిచాడు. డిసెంబర్ 17న జ‌రిగిన ఫినాలే ఎపిసోడ్‌లో ప్రశాంత్ ని విన్న‌ర్‌గా ప్ర‌క‌టించిన నాగార్జున‌.. అమర్ దీప్ రన్నరప్ అన‌తి తెలియ‌జేశారు. ఈ సీజన్ విన్నర్ ఎవరనేది చివరివరకు సస్పెన్స్ గానే న‌డిచింది. రైతు బిడ్డ ట్యాగ్ ప్ర‌శాంత్‌కి బాగా వ‌ర్క‌వుట్ అయింది.స్వ‌ల్ప ఓటింగ్ తేడాత‌నే ప్ర‌శాంత్ గెలిచిన‌ట్టు తెలిసింది. ఇక ప్ర‌శాంత్ గెలిచాక ఆయ‌న చేసిన ర‌చ్చ‌కి కొన్ని రోజుల పాటు జైలుకి కూడా వెళ్ల‌డం మ‌న‌కు తెలిసిందే.

ఉల్టా పుల్టా బాగానే వ‌ర్క‌వుట్ అయిన‌ట్టుంది.. బిగ్‏బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే‏కు రికార్డ్ టీఆర్పీఅయితే ఈ పరిణామాల త‌ర్వాత ఇక బిగ్ బాస్ షో ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ప్ర‌చారం న‌డుస్తున్న స‌మయంలో స్టార్ మా ఒక అనౌన్స్ మెంట్ చేసింది. డిసెంబర్ 17న ప్రసారమైన గ్రాండ్ ఫినాలేకు ఏకంగా 21.7 TVR (టెలివిజన్ వ్యూ రేటింగ్) లభించిందని.. ఒక రకంగా ఇది పెద్ద రికార్డ్ అని.. ఇంతటి ఆదరణ తమ షోకు అందించిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియ‌జేసింది స్టార్ మా .ఇప్పటివరకు వచ్చిన అన్ని సీజన్స్ కంటే ఈ సీజన్ ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించ‌డం వ‌ల్ల‌నే అన్ని సీజ‌న్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసింద‌ని నెటిజ‌న్స్ భావిస్తున్నారు. ఈ సీజ‌న్‌కి ఇంతటి భారీ రెస్పాన్స్ రావ‌డంతో సీజ‌న్ 8ని మ‌రింత కొత్త‌గా ప్ర‌జెంట్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇక మరి కొద్ది రోజుల‌లో ఓటీటీ షో కూడా మొద‌లు పెట్టాల‌నే ఆలోచ‌న‌లో కూడా ఉన్న‌ట్టు తెలుస్తుంది.