పాపం మృణాల్ ఠాకూర్‌ని అంత బాడీ షేమింగ్ చేశారా.. దారుణంగా మాట్లాడ‌డంతో..!

పాపం మృణాల్ ఠాకూర్‌ని అంత బాడీ షేమింగ్ చేశారా.. దారుణంగా మాట్లాడ‌డంతో..!

మృణాల్ ఠాకూర్ అంటే మ‌న తెలుగు ప్రేక్ష‌కులు ఠ‌క్కున గుర్తు ప‌ట్ట‌క‌పోవ‌చ్చేమో కాని సీతారామం బ్యూటీ అంటే వెంట‌నే ఆమె రూపం అంద‌రికి గుర్తుకు వ‌స్తుంది. హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన సీతారామం చిత్రంలో మృణాల్ ఠాకూర్ చీర‌క‌ట్టులో చాలా అందంగా క‌నిపించి ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేసింది. సీతారామం చిత్రంతో.. టాలీవుడ్ లో వెండితెరపై అడుగుపెట్టిన హీరోయిన్ “మృణాల్ ఠాకూర్” ఇప్పుడిప్పుడే తెలుగులో అవ‌కాశాలు అందిపుచ్చుకుంటుంది. చివ‌రిగా నాని న‌టించిన హాయ్ నాన్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించి అల‌రించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న “ఫ్యామిలి స్టార్” లో కూడా ఈ అమ్మ‌డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

ఇవే కాక‌ మృణాల్ చేతిలో మరెన్నో భారీ ఆఫర్లు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. శివకార్తికేయన్ హీరోగా..ఏ ఆర్ మురుగుదాస్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో.. మృణాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత శింబు హీరోగా నటించబోతున్న ఓ యాక్షన్ చిత్రంలో కూడా మృణాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసే ఆలోచ‌న చేస్తున్నార‌ని టాక్. మైత్రి మూవీస్ నిర్మించ‌నున్న చిత్రంలో కూడా మృణాల్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాలు క‌నుక హిట్ అయితే మృణాల్ రానున్న రోజుల‌లో టాప్ హీరోయిన్‌గా ఎద‌గ‌డం ఖాయం.

మృణాల్ ఠాకూర్ సోష‌ల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటూ త‌న అందాల‌తో రచ్చ చేస్తుంది. కేక పెట్టించే అందాల‌తో కాక రేపుతుంది. అమ్మ‌డి ఘాటు అందాలు చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతారు. ఇక ఇటీవ‌ల మృణాల్ ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటుంది. తాజా ఇంట‌ర్వ్యూలో మృణాల్ ఠాకూర్ బాడీ షేమింగ్ కు గురైనట్టు తెలియ‌జేసింది. ‘మీరు అస్సలు సెక్సీగా లేరని’, ‘ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు? మరికొందరు బరువు తగ్గమని సలహాలిస్తూ త‌న‌ని అవ‌మానించార‌ని మృణాల్ తెలియ‌జేసింది.బాలీవుడ్‌లో త‌న‌కు ఇలా జ‌రిగింద‌ని, సౌత్‌లో మాత్రం త‌ను ధీటుగా ముందుకు సాగుతుంద‌ని స‌మాచారం.మృణాల్ హ‌వా చూస్తుంటే రానున్న రోజుల‌లో ఆమె స్టార్ హీరోగా ఎద‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.