Breaking | రేపటి నుంచి రైతు రుణమాఫీ.. ఆదేశాలు జారీ
Breaking | నోట్ల రద్దు, కరోనా కారణంగా ఆలస్యమని ప్రకటన విధాత: రైతు రుణమాఫీ అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రేపటి నుంచి రైతు రుణమాఫీ అమలు కానున్నది. తొలి విడత మిగిలిపోయిన 19 వేల కోట్ల రుణాల మాఫీ చేయనున్నారు. సెప్టెంబర్ రెండో వారంలోగా రుణమాఫీ పూర్తి అవుతుంది. నోట్ల రద్దు, కరోనా కారణంగా రుణమాఫీ ఆలస్యమైందని ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే రుణమాఫీ ఆలస్యం: మంత్రి నిరంజన్ రెడ్డి ఆర్థిక […]
Breaking |
- నోట్ల రద్దు, కరోనా కారణంగా ఆలస్యమని ప్రకటన
విధాత: రైతు రుణమాఫీ అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రేపటి నుంచి రైతు రుణమాఫీ అమలు కానున్నది. తొలి విడత మిగిలిపోయిన 19 వేల కోట్ల రుణాల మాఫీ చేయనున్నారు. సెప్టెంబర్ రెండో వారంలోగా రుణమాఫీ పూర్తి అవుతుంది. నోట్ల రద్దు, కరోనా కారణంగా రుణమాఫీ ఆలస్యమైందని ప్రకటించారు.
ఆర్థిక ఇబ్బందుల వల్లే రుణమాఫీ ఆలస్యం: మంత్రి నిరంజన్ రెడ్డి
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే రుణమాఫీ ఆలస్యమయింది. కరోనా మూలంగా లక్ష కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రం నష్టపోయింది. కేంద్రం ఎఫ్ ఆర్ బీఎం నిధులు విడుదల చేయకుండా తెలంగాణ పట్ల అనుసరించిన విధానం, నోట్ల రద్దు వల్ల ఏర్పడిన మందగమనం మూలంగా రుణమాఫీ ఆలస్యమయింది.
నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆటంకం కలగకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందుకే ఇప్పటి వరకు రుణమాఫీ ప్రక్రియ ఆలస్యమయింది. కరోనా విపత్తులోనూ రైతులకు ఇబ్బంది కలగకుండా రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగింది.
రుణమాఫీ విషయంలో రైతులను మభ్యపెట్టేందుకు విపక్షాలు ప్రయత్నించినా రైతులు ఇన్ని చేసిన కేసీఆరే రుణమాఫీ చేస్తాడని రైతులు వారి మాటలను విశ్వసించలేదు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి, రైతులకే తొలి ప్రాధాన్యం అన్న దానికి కేసీఆర్ పాలనే నిదర్శనం.
రైతుల రుణమాఫీకి ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి రైతుబిడ్డగా, రైతుల మంత్రిగా రైతుల పక్షాన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram