చిరు 156వ సినిమా స్ట్రిప్ట్ పేప‌ర్ లీక్ అయిందా.. టైటిల్ ఏం పెట్టారో తెలుసా?

చిరు 156వ సినిమా స్ట్రిప్ట్ పేప‌ర్ లీక్ అయిందా.. టైటిల్ ఏం పెట్టారో తెలుసా?

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌లో ఒక‌రైన చిరంజీవి కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తున్నాడు. మ‌ధ్య‌లో పాలిటిక్స్ వ‌ల‌న సినిమాల‌కి కాస్త బ్రేక్ ఇచ్చిన ఆయ‌న ఆ త‌ర్వాత ఖైదీ నెం 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా మంచి హిట్ కావ‌డంతో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. చివ‌రిగా చిరు న‌టించిన గాడ్ ఫాద‌ర్, వాల్తేరు వీర‌య్య చిత్రాలు కొంత అల‌రించిన భోళా శంకర్ మాత్రం బెడిసికొట్టింది. దీంతో ఇప్పుడు త‌న 156వ సినిమాలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్ లో చిరు 156వ సినిమా ఉంటుంద‌ని ఇప్ప‌టికే అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది.

ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది, టైటిల్ ఏంటి అనే విష‌యాల కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ పేపర్స్ లీక్ అయినట్టుగా సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా వైర‌ల్ అవుతుంది. అందులో భాగంగానే ఈ సినిమాకి విశ్వంభర అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండ‌గా, మూవీని సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో రూపొందించ‌నున్నారట‌. ప్ర‌స్తుతం చిరంజీవి లావణ్య వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన ప‌నుల‌తో బిజీగా ఉన్నారు. దానికి తోడు రీసెంట్ గా చిరంజీవికి మోకాలు సర్జరీ కూడా జరిగింది. ఈ క్ర‌మంలో సినిమా షూటింగ్ కాస్త వాయిదా ప‌డుతుంది.

ఈ నెల చివ‌ర‌లో చిరు 156వ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని టాక్ వినిపిస్తుంది. రీఎంట్రీలో చిరుకి ఒక్క పెద్ద హిట్ కూడా రాలేదు. ఈ సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడనే సూచనలైతే అభిమానుల‌కి కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. వశిష్ట తొలి సినిమా బింబిసార సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి పని చేయ‌గా, ఇప్పుడు మ‌రోసారి ఈ క్రేజీ కాంబో ప్రేక్షకుల‌ని అల‌రించ‌డానికి సిద్ధ‌మైంది. ఇక ఈ సినిమాకి చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.చంద్రబోస్ పాటలు రాయనున్నారు. ఇందులో చిరు త‌న ఏజ్‌కి త‌గ్గ పాత్ర‌లో క‌నిపించి అల‌రించ‌నున్నారు.