హనుమంతుడిగా కనిపించి సందడి చేయనున్న చిరంజీవి.. ఇందులో నిజమెంత?

మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటిక కుర్రాళ్లకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. రీఎంట్రీ తర్వాత చిరంజీవి కొత్త ప్రయోగాలు చేస్తుండగా, అవి సక్సెస్ కావడం లేదు. చివరిగా భోళా శంకర్ చిత్రంతో పెద్ద ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. అయితే త్వరలో విశ్వంభర చిత్రం షూటింగ్‌తో బిజీగా కానున్నాడు మెగాస్టార్. అయితే చిరంజీవికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. చిరు. ఓ చిత్రంలో హనుమంతుడిగా కనిపించి ప్రేక్షకులని అలరించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.
చిరంజీవి హనుమంతుని భక్తుడు అనే విషయం తెలిసే ఉంటుంది. ఆయనకి హనుమంతుడి పాత్రలో నటించే అవకాశం దక్కితే ఊరుకుంటారా.. వెంటనే ఒకే అనేయరు. హనుమాన్ సినిమాలో ఆంజనేయుడిగా కీలక పాత్రలో చిరు కనిపించి సందడి చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. సినిమా క్లైమాక్స్ లో కొద్ది నిమిషాల పాటు హనుమంతుడి దర్శనం ఉంటుందని , ఆ హనుమ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించారని సమాచారం. సర్ ప్రైజింగ్ గా ఈపాత్రనురివిల్ చేయాలని టీమ్ ప్లాన్ చేసినట్టు ఓ టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా, చిరు గతంలో ఆయన కెరీర్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో కాసేపు హనుమంతుడిలా కనిపిస్తాడు
ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే… ఈ చిత్రం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతుంది. యంగ్ హీరో తేజా సజ్జా నటిస్తున్నాడు. బడా హీరోలకు ఢీకొట్టడానికి.. సంక్రాంతి సినిమాల పోటీని రసవత్తరంగా మార్చడానికి ఏమాత్రం భయపడుకుండా.. హనుమాన్ బరిలోకి దిగుతున్నాడు. ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇది అందరికి గూస్ బంప్స్ తెప్పించింది. ఇక సినిమా కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. పలు భాషలలో ఈ సినిమా విడుదల అవుతుండగా, అంతటా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం ఖాయమని చిత్ర బృందం భావిస్తుంది.