CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు!
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బయలుదేరుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆకస్మిక పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్ లు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వారు ఢిల్లీ కి చేరుకుంటారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బయలుదేరుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆకస్మిక పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్ లు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వారు ఢిల్లీ కి చేరుకుంటారు.
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నుండి పిలుపు రావడంతో వారు ఢిల్లీకి పయనమయ్యారు.
ఈ రోజు… రేపు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని వారికి కేసీ వేణుగోపాల్ సూచించినట్లుగా సమాచారం. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, పీసీసీ కమిటీ భర్తీ అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డిని, రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలను పిలిచినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఉగాది కి కాబినెట్ విస్తరణ ఉంటుందనే చర్చ నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram