ఏంటి వ‌రుణ్ తేజ్ అస‌లు పేరు ఇదా.. ఇన్నాళ్ల‌కి ఆధారాల‌తో నిజం బ‌య‌ట‌ప‌డింది..!

  • By: sn    breaking    Feb 25, 2024 12:25 PM IST
ఏంటి వ‌రుణ్ తేజ్ అస‌లు పేరు ఇదా.. ఇన్నాళ్ల‌కి ఆధారాల‌తో నిజం బ‌య‌ట‌ప‌డింది..!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ కెరియ‌ర్‌లో కూల్ అండ్ కామ్‌గా ముందుకు సాగుతున్నాడు. మ‌ధ్య మ‌ధ్య‌లో ఫ్లాప్స్ వ‌చ్చిన కూడా ఏ మాత్రం అధైర్య‌ప‌డ‌కుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇటీవ‌ల వైవాహిక జీవితంలోకి కూడా అడుగుపెట్టాడు. పెళ్లైన త‌ర్వాత వ‌రుణ్ తేజ్ నుండి వ‌స్తున్న మూవీ ఆప‌రేష‌న్ వాలంటైన్..ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవెల్ లో మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేప‌థ్యంలో వరుణ్ తేజ్ సౌత్ టు నార్త్ వరకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ మూవీ 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో ఉంటుంద‌ని తెలుస్తుంది.

మూవీలో వరుణ్ తేజ్ కి జంట‌గా మానుషి చిల్లర్ న‌టిస్తుంది. మూవీపై అయితే అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. మ‌రింత పెంచేందుకు వ‌రుణ్ తేజ్ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తూ వ‌స్తున్నారు. తాజా ఇంట‌ర్వ్యూలో వ‌రుణ్ త‌న అసలు పేరు రివీల్ చేసి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చారు. వరుణ్ తేజ్ అసలు పేరు ‘సాయి వరుణ్ తేజ్’ అని చెప్ప‌గా, స్క్రీన్ మీద పెద్దదిగా ఉంటుందని సాయిని తీసేసి వ‌రుణ్ తేజ్‌గా కొనసాగుతున్నాడ‌ట‌. అయితే త‌న ఆధార్, పాస్ పోర్ట్‌, స‌ర్టిఫికెట్స్‌లో మాత్రం ‘సాయి వరుణ్ తేజ్’ అని ఉంటుందట. వరుణ్ తేజ్ హైట్ 194 సెంటీమీటర్లు.. అంటే 6 అడుగుల 4 అంగుళాలు కాగా, షూటింగ్ స‌మ‌యంలో హీరోయిన్స్ ప‌క్క‌న న‌టించేట‌ప్పుడు వారి హైట్‌కి అడ్జెస్ట్ అయి న‌టిస్తుంటాన‌ని చెప్పుకొచ్చాడు వ‌రుణ్‌

ఇక త‌న‌కి టాటూ అంటే ఇష్ట‌మ‌ని చెప్పిన వ‌రుణ్ తేజ్, దానిని వేయించుకోవాలంటే భ‌య‌మ‌ని అన్నాడు. కాని ఏదో ఒక రోజు దానిని వేయించుకుంటానంటున్నాడు. ఇక తన ప్రతి సినిమాకి ఎంతో కొంత అని ఫిక్స్డ్ అమౌంట్ రెమ్యునరేషన్ తీసుకోన‌ని చెప్పిన వ‌రుణ్ .. బ‌డ్జెట్‌ని బ‌ట్టి చార్జ్ చేస్తుంటాడ‌ని స‌మాచారం. లావ‌ణ్య త్రిపాఠితో వివాహం త‌ర్వాత వ‌రుణ్ తేజ్ చాలా కూల్ అండ్ కామ్‌గా ఉంటున్న‌ట్టు తెలుస్తుంది. ఆయ‌న ఇల్లు, సినిమాలు అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. త్వ‌ర‌లో మ‌ట్కా అనే సినిమాతో కూడా ప‌ల‌క‌రించ‌నున్నాడు వ‌రుణ్