Ram Charan| రాంచరణ్ ‘పెద్ది’ మూవీ స్పెషల్‌ పోస్టర్‌

మెగా హీరో రామ్‌చరణ్‌ వెండితెరకు పరిచయమై 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విషెస్‌ చెబుతూ ‘పెద్ది’ మూవీ టీమ్‌ స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

Ram Charan| రాంచరణ్ ‘పెద్ది’ మూవీ స్పెషల్‌ పోస్టర్‌

విధాత : మెగా హీరో రామ్‌చరణ్‌(Mega Hero Ram Charan), వెండితెరకు పరిచయమై 18 ఏళ్లు పూర్తి చేసుకున్న(18 years cinema journey) సందర్భంగా విషెస్‌ చెబుతూ ‘పెద్ది’ మూవీ టీమ్‌(Pedhdi Movie) స్పెషల్‌ పోస్టర్‌ను( Special Poster) విడుదల చేసింది. ‘‘మా ‘పెద్ది’ 18ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషం. తెరపై ఘనమైన వారసత్వం కొనసాగిస్తూనే బయట ఎంతో వినయ విధేయతలు కలిగి ఉండటమే కాకుండా, తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథాను ఏర్పాటు చేసుకున్నాడు. మాకెన్నో అద్భుతమైన ఉత్సాహాన్ని కలిగించే సందర్భాలను ఇచ్చాడు. ‘పెద్ది’ నుంచి చాలా పెద్ద సర్‌ప్రైజ్‌లు మొదలు కాబోతున్నాయి అని చిత్ర బృందం పేర్కొంది.

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘చిరుత’ సినిమాతో వెండితెరకు పరిచయమైన రామ్‌చరణ్‌ సినీ పరిశ్రమంలో 18 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. తండ్రి మెగాస్టార్ వారసత్వాన్ని కొనసాగిస్తూ డ్యాన్స్‌లు, ఫైట్స్‌తో పాటు, ‘రంగస్థలం’ చిత్రంలో తనదైన నటనతో శభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పెద్ది’ నిర్మాణంలో ఉంది. ఈ సినిమాలో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ కథతో రానుంది. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘పెద్ది’లో కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌తోపాటు, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.