భోజ‌నం చేశాక‌ ప్లేట్‌లోనే చేతులు క‌డుగుతున్నారా..? ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ట‌..!

అన్నం తిన్న త‌ర్వాత ఆ ప్లేటులోనే చాలా మంది చేతులు క‌డుగుతుంటారు. ఇలా తిన్న ప్లేట్‌లోనే చేతులు క‌డ‌గ‌డం మంచిది కాద‌ని వాస్తు శాస్త్రం చెబుతుంది. అన్నం తినే ప్లేటును గౌర‌విస్తేనే పేదరికం ఉండ‌ద‌ని, ద‌రిద్రం కూడా తొల‌గిపోతుంద‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

  • Publish Date - March 26, 2024 / 01:39 AM IST

అన్నం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపం.. అందుకే అన్నాన్ని పడేయడం కానీ, తొక్కడం కానీ చేయొద్దంటారు పెద్దలు. మ‌నం అన్నం తినే ప్లేటును కూడా గౌర‌వించాల‌ని పెద్ద‌లు సూచిస్తున్నారు. అయితే అన్నం తిన్న త‌ర్వాత ఆ ప్లేటులోనే చాలా మంది చేతులు క‌డుగుతుంటారు. ఇలా తిన్న ప్లేట్‌లోనే చేతులు క‌డ‌గ‌డం మంచిది కాద‌ని వాస్తు శాస్త్రం చెబుతుంది. అన్నం తినే ప్లేటును గౌర‌విస్తేనే పేదరికం ఉండ‌ద‌ని, ద‌రిద్రం కూడా తొల‌గిపోతుంద‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

తిన్న త‌ర్వాత ప్లేట్‌లోనే చేతులు క‌డిగితే ఆ ఇంటికి అశుభం కూడా క‌లుగుతుంద‌ట‌. కాబ‌ట్టి భోజ‌నం చేశాక ప్లేట్‌లో కాకుండా ప‌క్క‌కి వెళ్లి కడుక్కోవాల‌ని సూచిస్తున్నారు. అన్నం తిన్నాక ప్లేట్‌ను ఎండిపోనివ్వ‌డం కూడా మంచిది కాదంటున్నారు. అలా చేస్తే కూడా దరిద్రం వస్తుందని.. అందుకే తినడం అయిపోయిన తర్వాత చేతులు కడగకుండా ప్లేట్లో కనీసం కొన్ని నీళ్లు పోయాలని అంటున్నారు.

ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం కూడా ల‌భించ‌ద‌ట‌..!

ప్లేట్‌లోనే చేతులు క‌డ‌గ‌డంతో.. ల‌క్ష్మీదేవి, అన్న‌పూర్ణ దేవికి కోపం వ‌స్తుంద‌ట‌. ఇలా చేసిన వారికి ఆహారం కూడా దొర‌క‌ద‌ని, ల‌క్ష్మీదేవీ అనుగ్ర‌హం కూడా ల‌భించ‌ద‌ని చెబుతారు. ఇంకా ఇలా చేయడం వల్ల ప్లేట్‌లో మిగిలిపోయిన ఆహారాన్ని అగౌరవ పరిచినట్లు అవుతుందని అంటున్నారు. అందుకే ఇలా చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 

Latest News